చిన్నపిల్లలకు స్నానం చేయించాలంటే భయపడుతున్నారా? ఈ సింపుల్ బెస్ట్ గ్యాడ్జెట్లు మీ కోసమే
అప్పుడే జన్మించిన శిశువు స్కిన్ ఎంత చాలా సున్నితంగా ఉంటుంది.
దిశ, వెబ్‌డెస్క్: అప్పుడే జన్మించిన శిశువు స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. కాగా బిడ్డ చర్మం ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతారు. శరీర ఉష్ణోగ్రత, తేమ, స్పర్శ లాంటివి చర్మ బాధ్యతలే. కాగా ముఖ్యంగా చిన్న పిల్లల చర్మం పట్ల అందరూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. లేకపోతే పిల్లలకు దీర్ఘకాలిక అలెర్జీల బారిన పడాల్సి వస్తుంది. ప్రాణాంతక ఇన్ఫెక్షన్లు వస్తాయి. పిల్లలకు ఇలాంటి అవస్థలు తప్పవు కాబట్టి కచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు.
నెలల వయసులో ఉన్న బేబీ చర్మం పువ్వుకన్నా నాజూకుగా ఉంటుంది. తొమ్మిది నెలలు తల్లి కడుపులో ఉంటుంది కాబట్టి అప్పుడే పుట్టిన బిడ్డ స్కిన్ మనలాగా అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కొన్ని నెలలు పడుతుంది. కాగా చిన్నపిల్లలకు స్నానం చేయించాలంటే అమ్మ, అమ్మమ్మలకు పెద్ద సవాలే. స్నానం చేయించేటప్పుడు చాలా భయపడుతారు. కాగా ప్రతీసారి పక్కవారి మీద డిపెండ్ అవ్వడం కన్నా.. మీరే ఎలాంటి భయం లేకుండా ఈ సింపుల్ బెస్ట్ గ్యాడ్జెట్లు మీకు బాగా మేలు చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
యూజ్ బాత్ మ్యాట్..
సాధారణంగా చాలా మంది చిన్న పిల్లలకు స్టూల్ లేదా పీట మీద కూర్చోబెట్టి స్నానం చేయిస్తారు. అదే సమయంలో ఎక్కడ పడిపోతారనే భయం కూడా ఉంటుంది. కాగా బాత్ మ్యాట్ మీద కూర్చోబెట్టి స్నానం చేయించండి. అప్పుడు జారిపోతారనే ఎలాంటి భయం ఉండదు. ఫస్ట్ టైమ్ స్నానం చేయించిన కూడా సులభంగా ఉంటుంది.
బాత్ స్పాంజ్..
చిన్న పిల్లలకు ఫేస్ కు సోప్ పెడితే చాలా ఏడుస్తారు. కళ్లలోకి పోతుంది. కాగా మెత్తగా పిల్లలకు కంపార్ట్ గా ఉండే బాత్ స్పాంజ్ వాడండి. సబ్బు వాటర్ లో దీన్ని ముంచి బాడీ మొత్తం తుడవచ్చు. దీంతో పిల్లల శరీరంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి.
బేబీ షవర్ క్యాప్..
చాలా మంది పిల్లల తలకు సోప్ పెట్టి స్నానం చేయించాలన్నా కాస్త భయపడతారు. తలపై వాటర్ పోస్తే సోప్ మింగేస్తారని ఓ భయం ఉంటుంది. కాగా అలాంటి భయం పెట్టుకోకుండా బేబీ షవర్ క్యాప్ ఉపయోగించండి. తలకు దీన్ని పెడితే.. ఫేస్ పై వాటర్ పడకుండా ఉంటాయి. నీళ్లు ముఖానికి దూరంగా పడేలా బేబీ షవర్ క్యాప్ ను డిజైన్ చేస్తారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.