ప్రపంచంలోనే అత్యంత విలువైన బియ్యం... కేజీ ధర ఎంతో తెలిస్తే షాక్ అయిపోతారు..
జపనీస్ కిన్మెమై రైస్ ను... ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తారు. దీని విలక్షణమైన ప్రొడ్యూసింగ్ టెక్నాలజీ రుచి, ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి రూపొందించబడిన ఈ బియ్యం.. ఆహార ప్రియులు, ఆరోగ్యంపై స్పృహ కలిగిన వ్యక్తులు ఎక్కువగా తీసుకుంటారు. ఇక దీని ప్రత్యేకమైన లక్షణం నో-రిన్స్ నాణ్యత...
దిశ, ఫీచర్స్ : జపనీస్ కిన్మెమై రైస్ ను... ప్రీమియం రైస్ అని కూడా పిలుస్తారు. దీని విలక్షణమైన ప్రొడ్యూసింగ్ టెక్నాలజీ రుచి, ఆరోగ్య ప్రయోజనాలను పెంచుతుంది. పేటెంట్ పొందిన కిన్మెమై పద్ధతిని ఉపయోగించి రూపొందించబడిన ఈ బియ్యం.. ఆహార ప్రియులు, ఆరోగ్యంపై స్పృహ కలిగిన వ్యక్తులు ఎక్కువగా తీసుకుంటారు. ఇక దీని ప్రత్యేకమైన లక్షణం నో-రిన్స్ నాణ్యత... అంటే వంట చేయడానికి ముందు కడగడం అవసరం లేదు. కిన్మెమై వైట్ రైస్ వేరియంట్ సాధారణ వైట్ రైస్ మాదిరిగానే ఉంటుంది. త్వరగా ప్రిపేర్ చేయొచ్చు కూడా. కానీ అమేజింగ్ నట్టీ టేస్ట్, వెల్వెట్ మాదిరి కనిపిస్తూ, తేమతో కూడిన కన్సిస్టెన్సీ కలిగి ఉండటం దాని ప్రత్యేకత.
కిన్మెమై వైట్ అండ్ బ్రౌన్ రైస్ వెర్షన్లు రెండూ సున్నితమైన పాలిషింగ్ ప్రక్రియ ద్వారా అనేక బెనిఫిట్స్ అందిస్తాయి. కంపెనీ ప్రకారం... Kinmemai బెటర్ వైట్ సాధారణ బియ్యం కంటే 1.8 రెట్లు ఎక్కువ ఫైబర్, ఏడు రెట్లు ఎక్కువ విటమిన్ B1 అందిస్తుంది. ఒత్తిడితో కూడిన పరిస్థితులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్‌లను (LPS) కలిగి ఉండి.. ఫ్లూ, ఇన్‌ఫెక్షన్లు, క్యాన్సర్, చిత్తవైకల్యంతో పోరాడే సహజ రోగనిరోధక వ్యవస్థ బూస్టర్ గా పని చేస్తుంది. ఇక ఈ బియ్యం మార్కెట్ ధర కిలోకు సుమారు రూ. 15,000గా ఉంది, అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన బియ్యంగా ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
కంపెనీ విషయానికి వస్తే... కిన్మేమై రైస్ ఏకైక ఉత్పత్తిదారు అయిన టోయో రైస్ కార్పొరేషన్ 1961లో స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం వాకాయమాలో ఉంది. రైస్-బఫింగ్ పరికరాల ఉత్పత్తిలో ప్రత్యేకత కలిగి, కంపెనీ 1970లలో ముసెన్‌మై(రిన్స్-ఫ్రీ రైస్)ను ప్రవేశపెట్టింది. వండే ముందు బియ్యాన్ని కడిగే అవసరాన్ని తొలగించడం ద్వారా ఏటా గణనీయమైన మొత్తంలో నీటిని ఆదా చేస్తుంది.