సన్ పాయిజనింగ్.. ఇంట్రెస్టింగ్ టాపిక్

సాధారణంగా సూర్య కిరణాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరానికి విటమిన్ డి అందించి... ఎముకలు బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. అయితే ఎండలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

Update: 2024-07-14 16:21 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా సూర్య కిరణాలు రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరానికి విటమిన్ డి అందించి... ఎముకలు బలంగా ఉండేందుకు హెల్ప్ చేస్తాయి. అయితే ఎండలో ఎక్కువ సేపు ఉండటం కూడా మంచిది కాదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. UV కిరణాల ఎఫెక్ట్ తో చర్మం ఎర్రబడుతుంది. నల్ల మచ్చలు ఏర్పడుతాయి. కొన్నిసార్లు స్కిన్ క్యాన్సర్ కూడా కలుగుతుంది. అయితే ఈ ప్రభావం తీవ్రతరమైతే వడదెబ్బకు మించిన పరిస్థితులు తలెత్తుతాయి. దీన్నే సన్ పాయిజనింగ్ లేదా ఫోటోడెర్మాటిటిస్ అంటారు. ఈ వ్యాధితో ఏటా 60వేల మరణాలు సంభవిస్తుండగా.. దీని లక్షణాలు, చికిత్స మార్గాల గురించి తెలుసుకుందాం.

లక్షణాలు

* చర్మం ఎర్రబడి పోవడం

* తీవ్రమైన నొప్పి

* పొక్కులు ఏర్పడటం

* జ్వరం

* చలి

* వికారం

* తల నొప్పి

* డీహైడ్రేషన్

కారణం

సన్ పాయిజనింగ్ అనేది ప్రధానంగా సూర్యుని UV కిరణాలకు ఎక్కువ కాలం అసురక్షిత బహిర్గతం వల్ల కలుగుతుంది. ఈ ఎక్స్ పోజర్ చర్మ కణాలకు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తుంది. తీవ్రమైన మంటను ప్రేరేపిస్తుందని నిపుణులు చెప్తున్నారు. కాగా ఆరోగ్యంగా ఉండటానికి వారంలో కొన్ని సార్లు 10 నుంచి 30 నిమిషాల సూర్యరశ్మిని పొందాలి. అంతకు మించి అవసరంలేదని చెప్తున్నారు. ఎండకు వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ వాడటం మర్చిపోవద్దని సూచిస్తున్నారు.

వచ్చే సమస్యలు ?

*శరీరం నుంచి అధికంగా నీరు బయటకు పోవడం వల్ల డీహైడ్రేషన్ కు దారి తీస్తుంది. అలాంటప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. పరిస్థితి తీవ్రమైతే రీహైడ్రేషన్ కోసం వైద్యుడిని సంప్రదించాలి.

* కొన్నిసార్లు తీవ్రమైన నొప్పి, పొక్కులు ఏర్పడవచ్చు, బొబ్బలు పగిలి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

* తగినంత రక్షణ లేకుండా తీవ్రమైన UV రేడియేషన్‌కు దీర్ఘకాలం బహిర్గతం కావడం వల్ల మెలనోమాతో సహా చర్మ క్యాన్సర్‌ ప్రమాదం తలెత్తుతుంది. ఇది అత్యంత తీవ్రమైన రకమని చెప్తున్నారు నిపుణులు.

* అకాల వృద్ధాప్యం, హైపర్‌పిగ్మెంటేషన్ తో చర్మం దీర్ఘకాలం దెబ్బతింటుంది.

* విపరీతమైన సందర్భాల్లో వేడి, మంటను కంట్రోల్ చేయడంలో శరీరం ఫెయిల్ అవుతుంది. దీని కారణంగా మూర్ఛ లేదా స్పృహ కోల్పోవడానికి దారితీస్తుంది.

చికిత్స

* చల్లటి నీటితో స్నానం సన్ పాయిజనింగ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించి, చర్మ ఉష్ణోగ్రతను తగ్గించవచ్చు.

* కోల్డ్ వాటర్ క్లాత్ కంప్రెస్‌లు నొప్పి, వాపును తగ్గించడంలో సహాయపడతాయి, కాబట్టి ఒక గుడ్డను చల్లటి నీటిలో నానబెట్టి ఎఫెక్టెడ్ ఏరియాలో 15 నుంచి 20 నిమిషాల వరకు ప్రెస్ చేయాలి.

* శీతలీకరణ, మాయిశ్చరైజింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందిన కలబంద వైద్యం మంచి ఫలితాలను ఇస్తుంది. అలోవెరా జెల్‌ను నేరుగా ప్రభావిత ప్రాంతంలో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు అప్లై చేయాలి.

* బేకింగ్ సోడా ద్రావణం చల్లటి ప్రభావాన్ని అందిస్తుంది. దురద నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఒక బౌల్ నీటిలో బేకింగ్ సోడా వేసి.. క్లాత్ తో చర్మంపై అప్లై చేయాల్సి ఉంటుంది.

* ఆపిల్ సైడర్ వెనిగర్ చర్మం pH ని సమతుల్యం చేస్తుంది. చికాకును తగ్గిస్తుంది.

* ఈ పరిస్థితి నుంచి ఉపశమనం కోసం వోట్మీల్ వాడండి. వోట్మీల్ బాత్ తేమను, రిలీఫ్ ను కలిగిస్తుంది. చల్లటి నీళ్లలో వోట్మీల్ వేసి 15 నుంచి 20 నిమిషాలు నానబెట్టి స్నానం చేస్తే సరిపోతుంది.

ఇబుప్రోఫెన్ లేదా ఎసిటమైనోఫెన్ వంటి ఓవర్-ది-కౌంటర్ పెయిన్ టాబ్లెట్స్ నొప్పి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి.


Similar News