హార్డ్ వర్క్‌తో అలిసిపోతున్నారా? ఈ సింపుల్ టిప్స్‌తో స్మార్ట్ వర్క్ ట్రై చేయండి.. సక్సెస్ మీ సొంతం..
ప్రస్తుతం ఎనిమిది గంటల ఆఫీస్ వర్క్ తప్పనిసరి అయిపోయింది. బిజినెస్ కన్నా ఎక్కువ జాబ్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు యూత్. దీంతో ఇంట్లో కన్నా వర్క్ ప్లేస్ లోనే టైం స్పెండ్ చేయడం అధికమైపోయింది. వర్క్ ప్రొడక్టివ్ గా, ఎఫిషియంట్ గా ఉండే క్రమంలో ఇలా జరుగుతుంది. దీనివల్ల చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. హార్డ్ వర్క్ తో తలలు పట్టుకుంటున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుతం ఎనిమిది గంటల ఆఫీస్ వర్క్ తప్పనిసరి అయిపోయింది. బిజినెస్ కన్నా ఎక్కువ జాబ్స్ పైనే ఫోకస్ చేస్తున్నారు యూత్. దీంతో ఇంట్లో కన్నా వర్క్ ప్లేస్ లోనే టైం స్పెండ్ చేయడం అధికమైపోయింది. వర్క్ ప్రొడక్టివ్ గా, ఎఫిషియంట్ గా ఉండే క్రమంలో ఇలా జరుగుతుంది. దీనివల్ల చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. హార్డ్ వర్క్ తో తలలు పట్టుకుంటున్నారు. కానీ ఇలా కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తే సింపుల్ వేలో ప్రొడక్టివిటీ సాధ్యమే అంటున్నారు నిపుణులు. ఎలా డీల్ చేయాలో టిప్స్ అందిస్తున్నారు.
టాస్క్ ప్రయారిటీ
ఆఫీస్ కు వెళ్లగానే మెయిల్స్ చెక్ చేయడం నుంచి కాల్స్ అటెండ్ చేయడం వరకు నంబర్ ఆఫ్ టాస్క్ లు ముందుంటాయి. కానీ వీటన్నింటినీ చెక్ చేసుకుని.. ముందుగా ఏ పని చేసుకుంటే బెటర్ గా ఉంటుందనేది ఆలోచించండి. అర్జంట్ అండ్ ఇంపార్టెన్స్ బెస్ చేసుకుని.. లిస్ట్ లో ఉన్న వర్క్స్ ఒకదాని తర్వాత ఒకటి ప్రయారిటీ ఇస్తూ పూర్తి చేయండి. ఈ పద్ధతి ఎలాంటి స్ట్రెస్ లేకుండా పని ఈజీగా కంప్లీట్ అయిపోతుంది.
సెట్ గోల్స్
ఒక ప్రాజెక్ట్ ఇన్ టైంలో పూర్తి చేయాలంటే ముందుగా క్లియర్ గా దాని గురించి అవగాహన ఉండాలి. పని స్టార్ట్ చేసే ముందే గోల్స్ సెట్ చేసుకోవాలి. లార్జర్ ప్రాజెక్ట్ ను చిన్న చిన్న భాగాలుగా.. మేనేజ్ చేసుకునేలా బ్రేక్ చేయండి. స్పెసిఫిక్ డెడ్ లైన్ పెట్టుకోండి. ఈ టెక్నిక్ మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది. ఫోకస్ గా ఉండేందుకు హెల్ప్ అవుతుంది.
టైం మేనేజ్మెంట్
టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ హార్డ్ వర్క్ ను స్మార్ట్ గా మార్చేస్తుంది. గంటకు గంటలు కూర్చుని కుస్తీ పడుతూ ప్రాజెక్ట్ పూర్తి చేసే బదులు.. మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటే రిఫ్రెష్ అవుతారు. ఫోకస్ పెరుగుతుంది. పని ఉత్పాదకత కూడా బాగుంటుంది. అందుకే ఫోకస్డ్ ఇంటర్వెల్స్ అవసరమని సూచిస్తున్నారు నిపుణులు.
యూజ్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్ వేర్
టెక్నాలజీ ద్వారా వర్క్ పూర్తవుతుందేమో తెలుసుకోండి. సాఫ్ట్ వేర్, టూల్స్ వినియోగిస్తే ఆటోమేటిక్ గా పని కంప్లీట్ అవుతున్నట్లయితే... ఇంపార్టెంట్ అండ్ క్రియేటివ్ వర్క్ పై మీ ఎనర్జీ, ఫోకస్ పెట్టొచ్చు. మీరు అంతగా ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదనే పనులు టూల్స్ సహాయంతో చేసుకోవచ్చు. ఇది బర్డెన్ తగ్గిస్తుంది. స్ట్రెస్ లేకుండా పని పూర్తి అయ్యేలా చేస్తుంది. కాగా టెక్నాలజీ యూజ్ తో అంటే యాప్స్ వినియోగంతో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మరింత సులభం అవుతుంది. నోట్ టేకింగ్, గ్రామర్ చెకింగ్ వంటివి ఆర్గనైజ్డ్ గా ఉండేలా చేస్తాయి. వర్క్ ప్రొడక్టివిటీ బూస్ట్ చేస్తాయి.
మల్టీటాస్క్ అవసరం లేదు
తలకు మించిన పని ఒత్తిడిని కలిగిస్తుంది. అలాగని ఒకేసారి అన్ని పనులు చేసుకుందాం అనుకుంటే ఎఫిషియెంట్ గా చేయలేరు. కాబట్టి మల్టీటాస్క్ అవాయిడ్ బెటర్ అంటున్నారు నిపుణులు. ఇంపార్టెంట్ టాస్క్ మీద ఫోకస్ చేస్తూ.. ఫినిష్ చేస్తూ పోవాలని సూచిస్తున్నారు. కాగా మల్టీ టాస్కింగ్ తరుచుగా ప్రొడక్టివిటీ తగ్గేలా చేస్తుంది. ఎర్రర్స్ ఎక్కువైపోతాయి.
ఇతరులతో పంచుకోండి
ప్రతీ పని మీరే చేస్తూ పోకుండా సాధ్యమైతే ఇతరులతో షేర్ చేయండి. ఈ టెక్నిక్ ఇతర ఇంపార్టెంట్ వర్క్ ఏదైతే ఉంటుందో దానిపై కాన్సంట్రేట్ చేసేలా చేస్తుంది. ఇందుకోసం టైం ఇవ్వగలరు. అయితే వారు ఎఫిషియెంట్ గా వర్క్ చేయగలరో లేదో చెక్ చేయండి. అలాంటి వారికే భాద్యతలను అప్పగించండి. సలహాలు, సూచనలు ఇవ్వండి.
పాజిటివ్ ఎన్విరాన్మెంట్
ఎప్పుడైనా మనం వర్క్ చేసే ప్లేస్ కంఫర్ట్ గా ఉండాలి. అప్పుడే బాగా పని చేయగలం. కూర్చునే చెయిర్ నుంచి ఫర్నిచర్, లైట్.. ఇలా ప్రతీ విషయంలో కేర్ తీసుకోవాలి. వర్క్ అట్మాస్పియర్ పాజిటివ్ గా ఉండేలా క్రియేట్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మూడ్ బూస్ట్ అవుతుంది.. ప్రొడక్టివిటీ పెరుగుతుంది.
కొత్తగా నేర్చుకోవడం మానొద్దు
ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు ఎప్పుడు చెప్పేది... ' నిరంతర విద్యార్థిగా ఉండాలి ' అని. ముఖ్యంగా మన వర్క్ కు సంబంధించిన న్యూ స్కిల్స్ నేర్చుకోవడం వల్ల పని మరింత సులభతరం అవుతుంది. ఇతరులతో పోలిస్తే వేగంగా, స్పష్టంగా పని పూర్తి చేయగలరు. త్వరగా ప్రమోషన్స్ సాధ్యం అవుతాయని.. తక్కువ టైంలో గొప్ప స్థాయికి చేరుకోగలరని చెప్తున్నారు నిపుణులు.