దిశ, ఫీచర్స్: రిటర్నింగ్ సోల్జర్ ఎఫెక్ట్ గురించి మీకు తెలుసా? యుద్ధం సమయంలో లేదా యుద్ధం ఆగిపోయిన వెంటనే ఎక్కువ మంది అబ్బాయిలు జన్మించడాన్ని సూచించే దృగ్విషయం. కాగా ఈ ప్రభావం మానవ లింగ నిష్పత్తిని ప్రభావితం చేసే అనేక అంశాలలో ఒకటి. ఈ ఫినామినన్ నిజమని తెలిపిన శాస్త్రవేత్తలు.. యునైటెడ్ స్టేట్స్‌లో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1954లో జన్మించిన శ్వేతజాతి శిశువుల విషయంలో ఇది మొదటిసారిగా గుర్తించారు. అంతేకాదు గ్లోబల్ పాండమిక్స్ వంటి ఒత్తిడి సమయాల్లో కూడా ఇది జరిగిందని కనుగొన్నారు.