ఆన్‌లైన్ మిస్టేక్స్.. ఒక్కసారి హ్యాకర్స్‌కు చిక్కితే అంతే సంగతులు..

ప్రస్తుతం డిజిటల్ ట్రాన్జాక్షన్స్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు జనాలు. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు దాదాపు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మన మనీ సేఫ్‌గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని చెప్తున్నారు నిపుణులు.

Update: 2024-09-12 13:02 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం డిజిటల్ ట్రాన్జాక్షన్స్‌కు ప్రయారిటీ ఇస్తున్నారు జనాలు. దీంతో బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలు దాదాపు ఆన్‌లైన్‌లోనే జరుగుతున్నాయి. ఇలాంటప్పుడు మన మనీ సేఫ్‌గా ఉంచుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉందని చెప్తున్నారు నిపుణులు. లేదంటే హ్యాకర్స్ చేతిలో పడి బ్యాంక్ జీరో బ్యాలెన్స్‌కు వచ్చేస్తుందని హెచ్చరిస్తున్నారు. మనం ఆన్‌లైన్‌లో చేస్తున్న మిస్టేక్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎలా రక్షించుకోవాలో కొన్ని టిప్స్ అందిస్తున్నారు.

ఎమోషన్స్‌ సమస్యల్లోకి నెట్టొచ్చు

చాలా మంది హ్యాకర్స్ సోషల్ ఇంజనీరింగ్ అనే ఒక అస్త్రాన్ని వాడుతారు. ఇందులో హ్యూమన్ ఎమోషన్స్‌తో గాలం వేస్తారు. ఒక వ్యక్తి అనారోగ్యంతో చనిపోయే స్థితిలో ఉన్నాడని.. హెల్ప్ చేసేందుకు ఈ లింక్ క్లిక్ చేయాలని... గర్భిణీ స్త్రీకి అర్జెంట్‌గా హెల్ప్ కావాలి.. ఈ హాస్పిటల్‌లో బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది సహాయం చేసేందుకు ఈ మెయిల్ ఓపెన్ చేయండి.. లాంటి మెసేజ్‌లతో మనం ఆ లింక్ ఓపెన్ చేసేలా చేస్తారు. ఒకవేళ క్లిక్ చేస్తే క్షణాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ నిల్ అయిపోతుందని వార్నింగ్ ఇస్తున్నారు ఎక్స్‌పర్ట్స్. అందుకే ప్రతి మెయిల్ జెన్యూన్ అని అనుకుని ఓపెన్ చేసే బదులు.. డైరెక్ట్ వెబ్‌సైట్ సందర్శించాలని సూచిస్తున్నారు.

మరీ నిజాయితీ అవసరమా?

‘ఎక్కడ పుట్టారు?’, ‘ మీ మదర్ మిడిల్ నేమ్ ఏంటి?’ లాంటి ప్రశ్నలకు కూడా మనం అత్యంత నిజాయితీతో ఆన్సర్ పెట్టేస్తాం.

మీ ఖాతా భవిష్యత్తులో హ్యాకర్స్ నుంచి సురక్షితంగా ఉంటుందని నిర్ధారించుకోవడానికి వెబ్‌సైట్‌లలో అడిగే సర్వసాధారణమైన ప్రశ్నలు. కానీ ఈ సమాధానాలు ఆన్‌లైన్ దాడిని ఆపేందుకు గోడలుగా మాత్రం ఉండలేవు అంటున్నారు నిపుణులు.పైగా హ్యాకర్స్‌కు ఇవే ప్లస్ అవుతాయని చెప్తున్నారు. అందుకే మీరు ఇప్పటికే ఈ సమాచారాన్ని ఆన్‌లైన్‌లో వెల్లడించినట్లయితే రిమూవ్ చేసేందుకు ప్రయత్నించమని సూచిస్తున్నారు.

ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ షేరింగ్ వద్దు

ఏదైనా నెట్‌వర్క్ లేదా సైట్‌తో వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవద్దు. చాలా ఇంపార్టెంట్ అయితేనే షేర్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు పబ్లిక్ Wi-Fi హాట్‌స్పాట్‌కి సైన్ అప్ చేస్తున్నట్లయితే... మీ పేరు, పుట్టిన తేదీ, చిరునామాను అడుగుతుంది.కానీ ఇక్కడ నిజాయితీగా ఉండటానికి ఎటువంటి చట్టపరమైన అవసరం లేదు. కాబట్టి మీ నిజమైన వివరాలు పంచుకోనవసరం లేదు. ఇలా మీ రియల్ డిటెయిల్స్ సేఫ్‌గా ఉంచండి.ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసుకుంటే అంత ఎక్కువగా మీ వివరాలు హ్యాకర్స్‌కు అందుబాటులో ఉంటాయి. అందుకే మీ సోషల్ మీడియా ఎకౌంట్‌లో మీరు షేర్ చేసే ఇన్ఫర్మేషన్ తక్కువగా ఉండేలా చూసుకోండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులకు ఎలాగూ మీ ఫోన్ నంబర్, పుట్టిన తేదీ, ఇమెయిల్ డిటెయిల్స్ ఇప్పటికే తెలిసి ఉంటాయి. కాబట్టి ఈ సమాచారం ఇతరులు తెలుసుకునేలా పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ ప్రైవసీ మీకు ఇంపార్టెంట్ అనుకుంటే.. మీ ఇన్ఫర్మేషన్ ఫ్రీగా ఇవ్వకండి. ఈ అలవాటు మీకు, మీ ఇంటికీ ప్రమాదమే.

సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఓపెనింగ్

మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ తరుచుగా ఓపెన్ అవుతుంటాయి. మీ Facebook ఖాతాలో, స్క్రీన్‌కు రైట్ కార్నర్‌లో ఉండే మెనూకి వెళ్లి.. సెట్టింగ్‌లపై క్లిక్ చేయండి. ఇందులో వచ్చిన ఆప్షన్స్‌లో ప్రైవసీపై క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ Facebook ప్రొఫైల్‌ ఎవరు చూడొచ్చో మేనేజ్ చేయగలరు. 'మీ భవిష్యత్తు పోస్ట్‌లను ఎవరు చూడగలరు?' అనే ప్రశ్నకు... స్నేహితులు మాత్రమే యాక్సెస్ కలిగి ఉండాలి. అదేవిధంగా ట్విట్టర్‌లో సెట్టింగ్‌ల కాగ్‌కి వెళ్లి.. ఆపై సెట్టింగ్‌లకు వెళ్లండి. ఈ విండోలో మీరు ట్వీట్‌లను ప్రైవేట్‌ చేయడంతో సహా అన్ని రకాల ప్రైవసీ సెట్టింగ్‌లను మార్చగలరు. మీ ట్వీట్‌లను మీరు పర్మిట్ చేసే వ్యక్తులు మాత్రమే చూడగలరు.

ఫ్రీయాప్స్‌తో ఈజీ కాదు

హ్యాకర్స్ యాప్‌ల ద్వారా మీ డివైజ్‌లోకి స్పైవేర్‌ను డౌన్‌లోడ్ చేయగలరు. అందుకే యాప్స్ ఇన్‌స్టాల్ చేసే ముందు, అనవసరమైన వ్యక్తిగత సమాచారాన్ని స్టోర్ చేయవని నిర్ధారించుకోవడానికి వాటిపై అనుమతులను తనిఖీ చేయండి. ఉదాహరణకు గేమ్ యాప్‌కి మీ నెట్‌వర్క్ సమాచారం లేదా కాంటాక్ట్ యాక్సెస్ అవసరం లేదు. కాబట్టి అవసరం లేదని చెప్పడం ఉత్తమం. ఇక యాప్‌లను క్రమం తప్పకుండా అప్ గ్రేడ్ చేయండి. ఎందుకంటే అవి సెక్యూరిటీ ఇష్యూస్ చెక్ చేస్తుంటాయి.

క్లియర్ బ్రౌజింగ్ హిస్టరీ

మీరు యూజ్ చేసిన డివైజ్‌ను మరొకరు ఉపయోగించబోతున్నట్లయితే.. ఉదాహరణకు మీ హోమ్ కంప్యూటర్ లేదా స్నేహితుని ఐప్యాడ్‌ని యూజ్ చేయాలనుకుంటే ఇది చాలా ముఖ్యమైన చిట్కా. Chrome, Firefox వంటి బ్రౌజర్‌లు మీరు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, మీరు విజిట్ చేసిన సైట్‌లను రికార్డ్ చేస్తాయి. ఈ సమాచారాన్ని చాలా వారాలపాటు ఉంచవచ్చు. కనుక మీరు మీ బ్రౌజింగ్ హిస్టరీ క్లియర్ చేయకుంటే డివైజ్‌తో పరిచయం ఉన్న ఎవరైనా మీ ఆన్‌లైన్ యాక్టివిటీ రికార్డ్‌ను దొంగిలించడం ఈజీ. అందుకే క్లియర్ చేయండి.. సురక్షితంగా ఉండండి.. అని సూచిస్తున్నారు నిపుణులు.

యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్

మనం డివైజ్‌లో ఉపయోగించాల్సిన అతి ముఖ్యమైన యాంటీ-హ్యాకర్ ప్రొడక్ట్స్‌లో యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ ఓకటి. కాగా ఇది క్రమం తప్పకుండా స్కాన్ చేస్తుంది. ప్రాబ్లమేటిక్‌గా అనిపిస్తే బ్లాక్ చేయాలని సూచిస్తుంది. మీ డెస్క్‌టాప్‌లోకి వెళ్లే అనవసరమైన వాటిని ఆపివేస్తుంది. కొన్ని బెస్ట్ యాంటీ-వైరస్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌లలో నార్టన్ సెక్యూరిటీ, మెకాఫీ టోటల్ ప్రొటెక్షన్, కాస్పెర్స్‌కీ టోటల్ సెక్యూర్ ఉండగా.. ఏ సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ మీ డెస్క్‌టాప్‌కు సెట్ అవుతుందో నిపుణులను అడిగి తెలుసుకోవచ్చు.

సేమ్ పాస్ వర్డ్‌తో ప్రాబ్లమ్

ఎక్స్‌పర్ట్స్ చెప్తున్న అతి ముఖ్యమైన టిప్స్‌లో సేమ్ పాస్ వర్డ్ ప్రాబ్లమ్ కొనితెస్తుందని.. ఎప్పుడు ఇలా వాడకూడదని చెప్తున్నారు. ఎందుకంటే ఒక ఎకౌంట్ హ్యాక్ అయితే మిగిలిన ఖాతాలు హ్యాక్ చేయడం సులభం అవుతుంది. ఇక పాస్ వర్డ్ మేనేజర్ వినియోగించడం వల్ల మీ డివైజ్ సురక్షితంగా ఉంటుంది. ఇది కాంప్లెక్స్ వర్డ్స్ యూజ్ చేయాలని సూచిస్తుంది. కాబట్టి ఎనిమిది క్యారెక్టర్స్‌తో కూడిన పాస్‌వర్డ్‌‌ను క్రాక్ చేసేందుకు హ్యాకర్స్‌కు దాదాపు రెండేళ్లయినా పట్టొచ్చని అంటున్నారు.ఇదీకాక టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ సెట్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇంపార్టెంట్ ఎకౌంట్స్‌కు ఇలాంటి సెక్యూరిటీ లేయర్ చాలా అవసరం అంటున్నారు నిపుణులు.

చెక్ డెయిలీ

మీ బ్యాంక్, క్రెడిట్ కార్డ్ ఖాతాలను తరచుగా చెక్ చేసుకోండి. రోజూ తనిఖీ చేయడం మరింత ఉత్తమం. అన్ఎక్స్‌పెక్టెడ్ ట్రాన్జాక్షన్స్ జరగకుండా చూసుకోవచ్చు. ప్రతీ లావాదేవీ జరుగుతున్నప్పుడు మొబైల్ లేదా ఈమెయిల్‌కు నోటిఫికేషన్ వచ్చేలా సెట్ చేసుకోవడం బెస్ట్ ఆప్షన్.

Tags:    

Similar News