మీ పిల్లలకు మీరే బెస్ట్ ఫ్రెండ్ కావాలంటే ఇలా చేయండి
జీవితంలో తల్లిదండ్రుల పాత్రను తనివితీరా ఆనందించడం ఓ అద్భుత అనుభవం.

దిశ, ఫీచర్స్ : జీవితంలో తల్లిదండ్రుల పాత్రను తనివితీరా ఆనందించడం ఓ అద్భుత అనుభవం. చాలా మంది పేరెంట్స్‌కు ఉండే గొప్ప కోరికల్లో ఒకటి బిడ్డకు మంచి స్నేహితుడిగా ఉండటమే. ఈ రిలేషన్ సాధారణ తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండే బంధానికి మించినది. నమ్మకం, కమ్యూనికేషన్, పరస్పర గౌరవాన్ని పెంచుతుంది. కానీ మీ బిడ్డతో స్నేహాన్ని ఎలా నిర్మించుకోగలరు?
చెప్పేది వినండి
మీ పిల్లలు ఏదైనా విషయాన్ని చెప్తున్నప్పుడు శ్రద్ధగా వినండి. తమపై కేర్ చూపిస్తున్నారని మీ బిడ్డ నమ్మడంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది. తొందరపడి తీర్మానాలకు వెళ్లే బదులు, సలహా ఇచ్చే బదులు, చెప్పేది వినడానికి సమయం కేటాయించండి. ఐ కాంటాక్ట్ చేస్తూ.. ఆలోచనాత్మకంగా స్పందించండి. చురుకుగా వినడం వల్ల మీకు వారు విలువైనవారని పిల్లలు ఫీల్ అవుతారు. తమను అర్థం చేసుకుంటున్నారని భావిస్తారు. అన్ని విషయాలు చెప్పుకునేందుకు ఇంట్రెస్ట్ చూపుతారు. మీ మధ్య బంధం బలపడి.. బహిరంగంగా చర్చించేందుకు ప్రయత్నిస్తారు.
అభిప్రాయాలు అడగండి
పిల్లలు పెరిగేకొద్దీ సొంత అభిప్రాయాలను, ప్రాధాన్యతలను పెంచుకుంటారు. మీరు ఏది ఉత్తమమని నమ్ముతున్నారో దాని వైపు వారిని నడిపించడం ఉత్సాహం కలిగించవచ్చు. కానీ వారి ఎంపికలను గౌరవించడం ముఖ్యం. వారు మీ అభిప్రాయాలకు భిన్నంగా ఉన్నప్పటికీ, వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి అనుమతించండి. అప్పుడే వారి వ్యక్తిత్వాన్ని గౌరవిస్తున్నారని నమ్ముతారు. మీ మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు.
ఒకే రకమైన ఆసక్తులు
మీ బిడ్డతో బంధం ఏర్పరచుకోవడానికి ఉత్తమ మార్గాలలో ఒకటి సాధారణ ఆసక్తులు, అభిరుచులను పంచుకోవడం. కలిసి స్పోర్ట్స్ ఆడటం, వంట చేయడం, పెయింటింగ్ వంటి ఉమ్మడి అభిరుచిని ఆస్వాదించడం. ఈ కార్యకలాపాలు కనెక్షన్, వినోదం కోసం అవకాశాలను సృష్టిస్తాయి. తద్వారా సానుకూల జ్ఞాపకాలను ఏర్పరుచుకుంటారు. మీతో మాట్లాడటానికి ఎదురుచూస్తుంటారు. ఇది కాలక్రమేణా స్ట్రాంగ్ బాండ్ ఏర్పడేలా చేస్తుంది.
సొంత అనుభవాలు
సాధారణంగా పిల్లలు తమ తల్లిదండ్రులను తప్పుపట్టలేని వారిగా చూస్తారు. ఇది మీ మధ్య దూరాన్ని పెంచవచ్చు. అలా కాకుండా తప్పులు, సవాళ్లు సహా సొంత అనుభవాల గురించి బిడ్డకు చెప్పండి. మీ బాల్యంలోని కథలను పంచుకోవడం, అప్పటి పరిస్థితుల గురించి మీ భావాలను చర్చించడం ద్వారా మీ బిడ్డ పోరాటాలను అర్థం చేసుకునే ఫ్రెండ్‌గా మారొచ్చు. మీతో నిజాయితీగా ఉండగలదు. భావోద్వేగ సంబంధాన్ని పెంచుకోవచ్చు.
గౌరవమైన సరిహద్దు
మీ బిడ్డకు మంచి స్నేహితుడిగా ఉండటం అంటే అన్ని నియమాలు, సరిహద్దులను వదిలేయడం కాదు. తల్లిదండ్రులుగా మీ పాత్రను కొనసాగిస్తూ.. అదే సమయంలో వారి అవసరాలు, భావాలపై సానుభూతి చూపడం కూడా ముఖ్యం. దాంతోపాటు నియమాలకు గల కారణాలను వివరించండి. సరిహద్దుల గురించి చర్చలలో పాల్గొనేలా చేయండి. పిల్లలు తమ శ్రేయస్సు కోసమే ఈ రూల్స్ ఉన్నాయని అర్థం చేసుకున్నప్పుడు.. వాటిని గౌరవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Read More..
Video Viral: ఫ్రీఫైర్ గేమ్ లో సింగిల్ క్లిక్.. సర్వస్వం పోగొట్టుకున్న కుటుంబం