భయపెడుతున్న సీతాకోక చిలుక

Update: 2023-01-04 05:41 GMT

దిశ, ఫీచర్స్ : నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్స్ (ఎన్‌సిబిఎస్) సైంటిస్టులు సీతాకోక చిలుకలకు సంబంధించిన ఒక అద్భుతమైన రహస్యాన్ని కనుగొన్నారు. వాటి బిహేవియర్ ఆయా సందర్భాల్లో ఎలా ఉంటుందనే దానిపై లోతైన పరిశోధన, అధ్యయనం నిర్వహించారు. పువ్వులపై వాలుతున్నప్పుడు.. వాటిని వేటాడే కీటకాల నుంచి ఏ విధంగా తప్పించుకుంటాయో తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు. తమపై ఎటాక్ చేసే మాంసాహార కీటకాల చర్యలను వెంటనే పసిగట్టే మిమెటిక్ సీతాకోక చిలుకలు.. ఒక విధమైన శబ్దం (మిమిక్రీ)తో మిగతా సీతాకోక చిలుకలను అప్రమత్తం చేస్తాయి. అలా అన్నీ కలిసి వాటి రహస్య సంకేతమైన మిమిక్రీతో కీటకాలను కన్ఫ్యూజ్ చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాయి.

పశ్చిమ కనుమల్లో పరిశోధనలు

సైంటిస్టులు పశ్చిమ కనుమలలోని 'మిమెటిక్ కమ్యూనిటీ' సీతాకోక చిలుకల సమూహంపై నిర్వహించిన అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఆరగించడానికి వచ్చిన మాంసాహార కీటకాల నుంచి తప్పించుకునేందుకు సీతాకోక చిలుకలు మిమిక్రీ అనే అద్భుతమైన టెక్నిక్‌ను ప్రయోగిస్తాయని గుర్తించారు. సీతాకోక చిలుకలు తమ వద్దకు కీటకాలు చేరే సమయంలో ఒక విధమైన శబ్దంతో హెచ్చరిక సంకేతాలు పంచుకుంటాయి. ఆ తర్వాత తెలివిగా కీటకాలను తరిమే మిమిక్రీ ప్రక్రియను స్టార్ట్ చేస్తాయి. ఇది మాంసాహారులైన కీటకాలు భయపడేలా లేదా కన్ఫ్యూజ్ చేసేలా ఉంటుందని శాస్ర్తవేత్తలు తెలుసుకున్నారు.

మిమిటిక్ కమ్యూనిటీ సీతాకోక చిలుకలు

ఇవి సాధారణంగా ఉష్ణ మండల ప్రాంతాల్లోని జీవ వైవిధ్య ప్రదేశాల్లో, ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో ఉంటాయి. ఈ కమ్యూనిటీకి చెందినవన్నీ ఒకే రంగులో ఉంటాయని చెప్పలేం. వేర్వేరు రంగులను, విభిన్న ప్రక్రియలను కలిగి ఉంటాయి. ప్రకృతి, పరిసరాలను బట్టి కూడా వాటి రంగు, బిహేవియర్ వేరుగా ఉండవచ్చు. అయితే మిమెటిక్ సీతాకోక చిలుకలన్నీ చాలా వరకు ఒకే విధమైన కలర్‌ను కలిగి ఎక్కువగా ఒకేచోట తిరుగుతుంటాయి. మొట్ట మొదటిసారిగా పశ్చిమ కనుమల్లోనే మిమెటిక్ సీతాకోక చిలుకలను సైంటిస్టులు చూశారు. ఆ తర్వాత ఇవి జీవ వైవిధ్య ప్రాంతాల్లోనూ ఉంటాయని, అయితే పశ్చిమ కనుమల్లోనే ఎక్కువగా ఉన్నాయని గుర్తించారు. ఆసియా ఖండంలోని పలు జీవవైవిధ్య ప్రాంతాల్లో, భారత దేశంలో కూడా ఇవి ఉండే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలో వందల ఏళ్లుగా సీతాకోక చిలుకలు దర్శనమిస్తుంటాయని సైంటిస్టులు పేర్కొన్నారు. అయితే మిమిక్రీ సీతాకోక చిలుకలు మాత్రం ప్రత్యేకమని, పశ్చిమ కనుమల్లోనే వీటి సంఖ్య అధికంగా ఉంటుందని సైంటిస్టుల అధ్యయనంలో తేలింది.

Read More...

తగినంత నీరు తీసుకోకపోతే చిన్నవయసులోనే చనిపోయే ప్రమాదం..సరికొత్త అధ్యయనం 

Tags:    

Similar News