Grey Hair : తెల్ల జుట్టు ఎందుకు వస్తుంది?

ఈ మధ్య తెల్ల జుట్టు(Grey Hair) కష్టాలు ఎక్కువపోయాయి. 10 ఏళ్ల పిల్లల నుంచి యువతి యువకుల వరకు.. గ్రే హెయిర్ కామన్ అయిపోయింది. తీసుకునే ఫుడ్, పొల్యూషన్ ఇందుకు కారణమని తెలుస్తుండగా.. అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది?

Update: 2024-09-06 09:12 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య తెల్ల జుట్టు(Grey Hair) కష్టాలు ఎక్కువపోయాయి. 10 ఏళ్ల పిల్లల నుంచి యువతి యువకుల వరకు.. గ్రే హెయిర్ కామన్ అయిపోయింది. తీసుకునే ఫుడ్, పొల్యూషన్ ఇందుకు కారణమని తెలుస్తుండగా.. అసలు వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది? దీనికి గల ముఖ్య కారణాలు ఏంటో తెలుసుకుందాం.

వృద్ధాప్యం

వయసు పెరిగే నా వెంట్రుకల కుదుళ్లు తక్కువ మెలనిన్ ను ఉత్పత్తి చేస్తాయి. జుట్టు రంగుకు కారణమయ్యే మెలనిన్.. లేకపోవడం వల్ల నల్లగా ఉండాల్సిన వెంట్రుకలు తెలుపు రంగులోకి మారుతాయి.

జీన్స్

మీ హెయిర్ ఎందుకు త్వరగా కలర్ చేంజ్ అవుతుందనే విషయం మీ జీన్స్ పై కూడా ఆధారపడవచ్చు. ఈ విషయంలో జన్యుపరమైన అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు నిపుణులు.

ఒత్తిడి

ఈ కాలంలో పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడం కష్టం అవుతుంది. చాలా మంది ఒత్తిడికి గురవుతున్నారు. అయితే ఇదే దీర్ఘకాలం కొనసాగితే జుట్టు పిగ్మెంటేషన్ ప్రభావితం అవుతుంది. గ్రే హెయిర్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది.

పోషకాల లోపం

సరైన డైట్ మెయింటైన్ చేయకపోయినా.. గ్రే హెయిర్ వస్తుందని చెప్తున్నారు నిపుణులు. అవసరమైన విటమిన్లు, మినరల్స్ లేకపోవడం ముఖ్యంగా విటమిన్ B12 లోపం తెల్ల జుట్టుకు కారణం అవుతుందని అంటున్నారు.

ఆక్సీకరణ ఒత్తిడి

శరీరంలో ఫ్రీ రాడికల్స్, యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత వెంట్రుకల కుదుళ్లను దెబ్బ తీస్తుంది. దీనివల్ల వైట్ హెయిర్ ఏర్పడుతుంది.

ధూమపానం

స్మోకింగ్.. పూర్తి ఆరోగ్యం, రక్త ప్రసరణపై హానికరమైన ప్రభావాలను చూపుతుంది. దీనివల్ల చిన్న వయసులోనే గ్రే హెయిర్ పాజిబిలిటీస్ ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.

ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్

బొల్లి(విటిలిగో), అలోపేసియా అరెటా వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. ఫలితంగా తెల్ల జుట్టు ఏర్పడుతుందని చెప్తున్నారు నిపుణులు.

Tags:    

Similar News