Aadhar Update : మీ ఆధార్‌ను మీరే ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు.. ఏం చేయాలో చూడండి!

ప్రస్తుతం భారతీయులకు ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా తప్పక అవసరం అవుతోంది.

Update: 2024-08-27 06:50 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం భారతీయులకు ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఉద్యోగాలకు అప్లై చేయాలన్నా తప్పక అవసరం అవుతోంది. అట్లనే బ్యాంకులు, స్కూళ్లు, హాస్పిటళ్లు ఎక్కడికి వెళ్లినా అడ్మిషన్ల కోసం ముందుగా ఆధార్ అడుగుతున్నారు. అయితే ఇది ఉన్నంత మాత్రాన సరిపోదు. దానిపై పేరు, అడ్రస్, మొబైల్ నెంబర్ వంటివి సరిగ్గా ఉంటేనే యాక్సెప్ట్ చేస్తున్నారు. దీంతో ఇటీవల చాలా మంది ఆధార్ అప్డేట్ కోసం మీ సేవా లేదా ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతూ.. గంటల తరబడి క్యూలో నిలబడుతూ అవస్థలు పడుతున్నారు. అలాంటి వారికి ఊరట కలిగించేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(UIDAI) ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే.. ఆధార్ కార్డును ఇంటివద్దనే ఉండి మీ మొబైల్ ఫోన్ ద్వారా కూడా ఫ్రీగా అప్‌డేట్ చేసుకోవచ్చని తెలిపింది.

వాస్తవానికి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ రెన్యూవల్ రెగ్యులేషన్స్-2016 ప్రకారం మీరు ఆధార్ కార్డు కలిగి ఉన్నప్పటికీ.. ప్రతీ పదేండ్లకు ఒకసారి తిరిగి అడ్రస్ అండ్ ఫొటో అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే ఎప్పుడో చిన్నప్పుడు దిగిన ఫొటోతో ఉన్న ఆధార్‌ను పదిరవై ఏండ్ల తర్వాత కూడా ఉపయోగించాలనుకుంటే ముఖ్యమైన పనులు నిలిచిపోవచ్చు. అందుకే అప్డేట్ మస్ట్. అయితే యూఐడీఏఐ ప్రకారం.. ఫ్రీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

లాస్ట్ డేట్.. సెప్టెంబర్ 14

ప్రజలు ఆధార్‌ను అప్డేట్ చేసుకునేందుకు UIDAI ఇప్పటికే పలుమార్లు అవకాశం కల్పించింది. అయితే పెరుగుతున్న డిమాండ్ మేరకు ఆ తేదీని పొడిగిస్తూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 14 లోపు మీ ఆధార్‌ను ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చునని యూఐడీఏఐ వెల్లడించింది. ఇది మీరు సొంతంగా మీ మొబైల్ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో చేసుకోవచ్చు లేదా ఆధార్ సెంటర్‌లో కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ రూ.50 వరకు చార్జెస్ తీసుకుంటారు.

ఫ్రీగా అప్డేట్ చేయడం ఎలా?

* ముందుగా మీరు https://myaadhaar.uidai.gov.in/ పోర్టల్‌లో లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ‘సెండ్ ఓటీపీ’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. తర్వాత దీనిని పైన పేర్కొనన ఆప్షన్‌లో నమోదు చేయాలి.

* ఆధార్ అప్డేట్ ప్రాసెస్‌లో ఓటీపీ ఎంటర్ చేశాక అక్కడ సర్వీస్‌లో డాక్యుమెంట్ అప్డేట్‌పై క్లిక్ చేయాలి. వెంటనే స్క్రీన్ మీద మీ పేరు, జెండర్, పుట్టిన తేదీ, అడ్రస్ వంటి వివరాలు కనిపిస్తాయి. ఇక వీటిలో మీరు ఏం అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేసి, అడిగిన ఐడీ అండ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి. వీటి సైజ్ 2MB కంటే తక్కువగా ఉండాలి. అట్లనే JPEG, PNG, PDF ఫార్మాట్లలో ఉంటేనే సంబంధిత పోర్టల్ సపోర్ట్ చేస్తుంది.

* చివరగా ఆయా డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేశాక సబ్‌మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ వెంటనే మీకు 14 అంకెల అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది. దీనిని జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. ఎందుకంటే మీ అప్డేట్ స్టేటస్ ఎంత వరకు వచ్చిందో చెక్ చేయాలంటే ఈ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ప్రాసెస్ పూర్తి చేశాక వారం రోజుల్లో మీరు అప్డేట్ చేసిన వివరాలతో కూడిన కొత్త ఆధార్ కార్డును పొందవచ్చు. 


Similar News