భర్తలను కంట్రోల్ చేయడానికి చిట్కాలిస్తూ బిజినెస్ చేస్తున్న యువతి..!
సాధారణంగా చాలా మంది డబ్బులు సంపాదించడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. కానీ, కొంత మంది విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు..
దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా చాలా మంది డబ్బులు సంపాదించడానికి వివిధ రకాల మార్గాలను ఎంచుకుంటుంటారు. కానీ, కొంత మంది విచిత్రమైన మార్గాలను ఎంచుకుంటారు. ఓ యువతి కూడా ఎవరూ ఊహించలేని విధంగా భర్తలను కంట్రోల్ చేసుకోవడానికి చిట్కాలు ఇస్తూ బిజినెస్ చేస్తుంది. భార్యలు, భర్తలు ఎప్పుడు వారి మాటే వినాలని అనుకుంటారు. భర్త, భార్య చెప్పిన పనులు చేస్తూ అతడు ఎప్పుడూ తన కంట్రోల్లోనే ఉంటాలని కోరుకుంటారు. ఈ యువతి అలాంటి వీరిని ఉద్దేశించి ఈ బిజినెస్‌ను నడిపిస్తోంది.
ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ యువతి భర్తలను భార్యలు ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలి. అనే విషయంపై ఫీజు చెల్లించిన వారికి ఆఫ్‌లైన్, ఆన్లైన్ క్లాసులు ఇస్తుంది. అయితే మరో ఆసక్తికర విషయమేంటంటే మహిళల ప్రవర్తను బట్టి వారికి తగినట్టుగా చిట్కాలను చెప్తుంది. ముఖ్యంగా భర్తలు, భార్యల మాటలు వినాలంటే వారితో గొడవ పడటం మానేయ్యాలని వారితో మంచిగా ఉండాలని ఆమె అంటోంది. మహిళలకు పలు రకాల టీప్స్ చేప్తూ ఫీజు రూపంతో డబ్బులు సంపాదిస్తుంది.
బ్లూ కలర్ బికినీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ రచ్చ.. నెట్టింట వీడియోలు వైరల్