Viral Video : ఏంది భయ్యా అది.. నడిరోడ్డుపై అమ్మాయితో!!

ఈ మధ్య యువతలో రీల్స్ పిచ్చి ఎక్కువైపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేమస్ అవుదామనే ఆలోచనతో కొందరు రకరకాల స్టంట్లు చేస్తూ..

Update: 2024-08-27 13:48 GMT

దిశ, ఫీచర్స్ : ఈ మధ్య యువతలో రీల్స్ పిచ్చి ఎక్కువైపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫేమస్ అవుదామనే ఆలోచనతో కొందరు రకరకాల స్టంట్లు చేస్తూ.. చివరికి ఇబ్బందుల పాలవుతున్నారు. మరికొందరు ఫేమస్ అవుదామనుకొని ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్నారు. ఇంకొందరు ఆవేశంలోనో, ఆనందంలోనో, ఏదో కొత్తగా చేయాలనే ఆత్రుతతోనో వెరైటీ స్టంట్స్ చేస్తూ.. చివరికి నవ్వులపాలవుతున్నారు. అచ్చం అలాంటి వీడియో ఒకటి ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. హీరో అవుదామనుకొని నడిరోడ్డుపై నవ్వులపాలయ్యాడంటూ నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

వైరల్ వీడియోను సమాచారం ప్రకారం.. ఓ యువకుడు ఏదో వెరైటీగా రీల్ చేద్దామని ముందే ఫిక్స్ అయినట్లున్నాడు. దీంతో అతను తన బైక్‌పై అమ్మాయిని కూర్చోబెట్టుకొని వెళ్తున్నాడు. ఇక రోడ్డు మధ్యలోకి వచ్చాక నా అంత తోపు ఇంకెవరూ లేరనుకున్నాడో ఏమో గానీ.. వెరైటీగా హీరో లెక్క ఫోజు ఇస్తూ స్టంట్ చేయబోయాడు. కానీ చివరికి అది బెడిసి కొట్టింది. బైకు హ్యాండిల్‌ను ఒక్కసారిగా పైకి ఎత్తగానే వెనుక కూర్చున్న అమ్మాయి ఒక్కసారిగా సీటు టైరుపైకి జారిపోయింది. అప్పుడే వెనుక నుంచి ఓ కారు వేగంగా వస్తోంది.. జస్ట్ మిస్ అంతే.. లేకుంటే క్షణాల్లో ప్రాణం పోయేది కానీ.. అదృష్టంకొద్దీ బయపడ్డారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ‘నడి రోడ్డుపై యువతితో ఏంది భయ్యా అది.. హీరో అవుదామనుకున్నవ్ కానీ.. నవ్వులపాలయ్యావ్ కదా’ అంటూ పలువురు కామెంట్లు పెడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, పోలీసులు హెచ్చరించినా కొందరికి బుద్ధి రావడం లేదంటూ ఇంకొందరు తిట్టిపోస్తున్నారు. వెరైటీ రీల్స్ కోసం ప్రాణాలు పణంగా పెట్టవద్దని సూచిస్తున్నారు. 

Video Credits To wb-rider-sayan Insta Id


Similar News