రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతికి వేధింపులు.. అంతలోనే బస్సు రావడంతో..

మహిళల రక్షణ కోసం నిర్భయ వంటి కఠినమైన చట్టాలున్నా.. పలువురికి శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే..

Update: 2024-08-30 13:39 GMT

దిశ, ఫీచర్స్ : మహిళల రక్షణ కోసం నిర్భయ వంటి కఠినమైన చట్టాలున్నా.. పలువురికి శిక్షలు పడుతున్నా పరిస్థితిలో మార్పు రావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిరోజూ దేశంలో ఎక్కడో ఒకచోట అమ్మాయిలపై వేధింపులు, దాడులు నిత్య కృత్యం అవుతున్నాయి. దీంతో పట్టపగలు కూడా ఒంటరిగా బయటకు వెళ్లేందుకు కొందరు భయపడుతున్నారు. ధైర్యం చేసిన వెళ్తున్నప్పటికీ కొందరు చేదు అనుభవాలను, పోకిరీల నుంచి వేధింపులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అలాంటి సంఘటనకు సబంధించిన పాత  వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

వైరల్ వీడియో ఇన్ఫర్మేషన్ ప్రకారం.. నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న యువతిని ఓ పోకిరి యువకుడు వెంబడిస్తాడు. ఆమె వద్దని వారిస్తున్నప్పటికీ వినకుండా వేధిస్తాడు. అంతటితో ఆగకుండా ఆమెను బలంగా వెనక్కి నెడుతూ దాడి చేస్తుంటాడు. దీంతో ఏం చేయాలో తోచక ఆ యువతి భయంతో కంగారు పడుతూ ఉంటుంది. అయితే అదృష్టం కొద్దీ అంతలోనే అటువైపుగా ఓ బస్సు వస్తుంది. యువకుడు యువతిని వేధించడాన్ని ప్రయాణికులు గమనిస్తారు. బస్సును ఆపివేయించి ముందుగా ఒకరు దిగి కిందికి వస్తారు. అయినా ఆ యువకుడు భయపడకుండా బస్సులో నుంచి దిగిన వ్యక్తిపైకి రాయి విసిరే ప్రయత్నం చేస్తాడు. దీంతో వెంటనే బస్సులోంచి మరింత మంది ప్రయాణికులు దిగివచ్చి ఆ యువకుడిని పట్టుకొని చితక బాదుతారు. యువతి సురక్షితంగా బస్సులో తీసుకెళ్తారు. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. దేశంలో ఎన్ని చట్టాలు వచ్చినా కొందరు పోకిరీల బుద్ధి మారడం లేదని, మహిళలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

For Video : https://x.com/cctvidiots/status/1644909645608148993


Similar News