27 సార్లు గర్భం దాల్చి, 69 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ.. ప్రపంచంలోనే అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిందిగా..
దిశ, ఫీచర్స్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వెంటనే నమ్మాలనిపించని అరుదైన సంఘటన. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది.
దిశ, ఫీచర్స్ : వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. వెంటనే నమ్మాలనిపించని అరుదైన సంఘటన. ఒకరు కాదు, నలుగురు కాదు, ఒక మహిళ ఏకంగా 27 సార్లు గర్భం దాల్చింది. 69 మంది పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచాన్నే ఆశ్చర్య పరిచింది. గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది. పైగా పిల్లల్లో 16 మంది కవలలేనట. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఈ సంఘటన ఎక్కడ జరిగింది? అనుకుంటున్నారా? ఆమె పేరు వాలెంటినా వాసెలీనా, భర్త పేరు ఫ్యోడర్ వాసిలీవ్, రష్యాలోని షుయా ప్రాంతంలో నివాసం ఉండేవారట. అయితే వాసెలీనా 1725 నుంచి 1765 మధ్య 27 సార్లు గర్భం ధరించిందట. 69 మందికి జన్మనిచ్చింది. రష్యాలోని కొన్ని పుస్తకాల్లో ఈ ప్రస్తావన ఉంది. ప్రజలు కథలుగా కూడా చెప్పుకుంటారు. కానీ శాస్త్రవేత్తలు మాత్రం దీనిని నమ్మడం లేదు. ఒక మహిళ అన్ని సార్లు గర్భం ధరించడం సాధ్యం కాదని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ సంతాన సాఫల్య వైద్యుడు జేమ్స్ సెగర్స్ అంటున్నాడు.
Read More..