మ‌న‌ల్ని మ‌నం నెట్టుకోవ‌డం ఎలా.. క్యూట్ వీడియో మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తారంతే..!

ఎంత క్యూట్‌గా ఉందో అంటూ మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. A video shows how a little girl gives her father push on a slide .

Update: 2022-07-14 13:16 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః చిన్న పిల్లలు అద్భుతంగా అనిపిస్తుంటారు. ఏ ప‌నైనా వాళ్లు సొంత‌గా చేయాలంటూ మారం పెడుతుంటారు. స్పీడ్‌గా నేర్చుకుంటూ, క్యూట్‌గా చేసేస్తుంటారు. స్వయం సమృద్ధిగా, స్వతంత్రంగా ఉండే ఇలాంటి పిల్లల్ని చూస్తే, హాయిగా, ఆనందంగానూ ఉంటుంది. అంత‌కుమించి, వారి క్యూట్ చేష్ట‌ల‌కు మ‌ళ్లీ మ‌ళ్లీ న‌వ్వొచ్చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో కూడా స‌రిగ్గా ఇలాంటిదే. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక చిన్నారి పాప పెద్దలతో సహా చాలా మందికి స్ఫూర్తినిస్తోంది. ఈ వీడియోను ఆమె తండ్రి గావిన్ బ్రామన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో చిన్న పాపాయి తన తండ్రిని ఒక స్లయిడ్ నుండి కిందకు నెట్ట‌డం చూడొచ్చు. ఆమె దాన్ని దిగ్విజ‌యంగా పూర్తిచేసిన త‌ర్వాత‌, తానే స్వయంగా స్లయిడ్‌పై కూర్చొని, తనంతట తానుగా కిందకు జారడానికి ముందు, త‌న తండ్రిని ఎలా నెట్టిందో అలాగే తను తాను స్వయంగా త‌న చేతుల్ని వీపుపైన పెట్టుకొని, నెడుతుంది. ఆనందంగా స్లయిడ్‌లోకి వెళుతుంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో "ఆమెకు తన సొంత వీపు ఉంది" అనే క్యాప్షన్‌తో షేర్ చేయగా, నెటిజ‌నులు తెగ న‌వ్వుకున్నారు. ఎంత క్యూట్‌గా ఉందో అంటూ.. మ‌ళ్లీ మ‌ళ్లీ చూస్తున్నారు. మీరు కూడా చూడండి.


Similar News