రక్తపు చుక్క చిందకుండా ఈ ఆడోళ్ల 'చెత్త' ఫైట్ చూడండి.. బెట్, పొట్టచక్కలే!!
ఎవ్వరొచ్చిన ఆపలేని ఈ పోరాటం ఎలా కొనసాగిందో ఈ వీడియోలో.. Aunties Fight Over Trash, Throw Gutter Water At Each Other.
దిశ, వెబ్‌డెస్క్ః పరిమిత స్తోమతతో జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. ప్రతి కష్టం నుండి ఉబికిన అసహనం, అసంతృప్తి, ఆందోళన నుండి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. ప్రత్యేకించి మురికివాడల్లో లేని లోపం అంటూ ఉండదు. నిత్యావసరాలైన తిండి, బట్ట, గుడ్డలే కాదు, అత్యవసరలైన నీరు, పరిశుభ్రత అసలే ఉండవు. బంగళాల్లో బాత్రూంలో కూడా శుద్ధనీరు వాడుతుంటే, ఇక్కడ వాడల్లో వర్షకాలంలో సైతం బిందెలు, బక్కెట్లు పట్టుకొని ట్యాంకర్లు, ట్యాపుల దగ్గర కొట్లాడాలి. లైన్లలో నిలబడి బకెట్లు నింపాలి, కొన్ని ప్రాంతాల్లో మట్కాల్లోని బావులు, నదుల నుండి నడిచెళ్లి నీళ్లు తీసుకురావాలి. అందుకే, ఉన్నదాంట్లో ఇల్లు పరిసరాలు శుభ్రంగా లేకపోతే, ఇరుగుపొరుగు మహిళల మధ్య వాగ్వాదాలు చెలరేగుతాయి. కొన్నిసార్లు అవి తీవ్రమయ్యి, తోపులాటలు, తన్నులు.. ఒక్కోసారి, ప్రాణాల మీదకొచ్చే పరిస్థితీ నెలకొంటుంది. కొట్లాడుకునేవారికి అది విషాదమే కానీ చూసే వారికి మాత్రం ఎంత వినోదమో..! ఈ వీడియో చూస్తే తెలుస్తుంది.
ఇండియాలో మాత్రమే చూడగలిగిన అలాంటి ఒక దేశీ ఫైట్ కెమెరాలో చిక్కుకుంది. ఇందులో ఇద్దరు మహిళలు తీవ్రంగా పోట్లాడుతుంటారు. ఇరుగు పొరుగు ఆడోళ్లు తమ ఇళ్ల ముందు చెత్తను ఊడ్చే క్రమంలో ఏర్పడిన గొడవ చిలికి, చిలికి.. మురికి గుంటలోకి చేరుకుంటుంది. ఆ మురుగు కాస్తా.. మనుషులపై కళ్లాపిలా మారుతుంది. ఇద్దరూ ఆవేశంగా తమ చీపురులతో చెత్తను ఒక్కొక్కరిపై విసురుకుంటూ, రక్తపు చుక్క చిందకుండా వీరంగం సృష్టిస్తారు. ఎవ్వరొచ్చిన ఆపలేని ఈ పోరాటం ఎలా కొనసాగిందో ఈ వీడియోలో చూడండి. బ్యాక్ గ్రౌండ్ నవ్వులేమో కానీ, వీడియో చూసినోళ్లు కూడా పొట్టచక్కలయ్యేలా నవ్వకపోతే.. బెట్ మరి!