చీర క‌ట్టుకొని న‌డిరోడ్డుపైన అలా.. అంతా షాకయ్యారు! (వీడియో)

కానీ, ఇలా ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డ‌మే మంచిదేమో! Woman skateboarding on the streets of Kerala .

Update: 2022-06-09 12:52 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః భార‌త‌దేశ సంస్కృతి అన‌గానే చాలా మందికి గుర్తుచ్చే విష‌యాల్లో చీర‌క‌ట్టు ముందు వ‌రుస‌లో ఉంటుంది. కానీ, నేటి కాలం యువ‌తుల్లో చీర క‌ట్టుకొని నిటారుగా నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్న ప‌రిస్థితుల్లో, కేర‌ళాకు చెందిన ఓ మహిళ న‌డి రోడ్డుపై చీర క‌ట్టుతో స్కేట్‌బోర్డింగ్ చేస్తూ కనిపించింది. బ్లాగర్ అయిన‌ లారిస్సా డిసా అనే యువ‌తి ట్రావెల్ వ్లాగ్‌లకు పేరుగాంచింది. ఈ వీడియోను షేర్ చేసిన ఆమె, "దీన్ని ఇలా చేయవలసి వచ్చింది. అప్పుడు రోడ్డుపైన‌ చాలా మంది ఉన్నారు. కొందరు సెల్ఫీలు కూడా తీసుకున్నారు హాహా, సరదాగా! ఉంది. కానీ, చీర కట్టుకుని లాంగ్‌బోర్డ్ చేయడం అంత సులభం కాదు." అని చెప్పింది. లారిస్సా ఛాలెంజ్‌ని కొంద‌రు నెటిజన్లు మెచ్చుకోగా, ఇంకొంద‌రు, సరైన భద్రతా జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా చేయ‌డం త‌ప్ప‌ని ఆమెను మందలిస్తున్నారు. స్కేటింగ్‌ మధ్యలో చీర పల్లు చ‌క్రాల‌కు ప‌డితే, ప్రమాదం జ‌రుగుతుంద‌ని హెచ్చిరించారు. ఇంత‌కీ, అది ఎలా ఉందో మీరూ ఓ లుక్కేయండి.. కానీ, ఇలా ప్ర‌య‌త్నించ‌క‌పోవ‌డ‌మే మంచిదేమో!


Similar News