లక్ష తామర పువ్వులతో ప్రత్యేక పట్టుచీర.. వేసవిలో చల్లగా.. శీతాకాలంలో వెచ్చగా..

చీర కట్టుకోవడానికి ఇష్టపడని అమ్మాయిలు ఎవరు ఉండరు.

Update: 2024-09-23 09:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : చీర కట్టుకోవడానికి ఇష్టపడని అమ్మాయిలు ఎవరు ఉండరు. భారతీయుల వస్త్రధారణలో చీర ఒక భాగం. అందుకే చాలామంది ఆడవారు ప్రతి ప్రత్యేక సందర్భానికి వివిధ రకాల చీరలను కట్టుకుంటూ ఉంటారు. కానీ పట్టు చీరలకు ఉన్న క్రేజ్ వేరేలా కనిపిస్తుంది. చాలా మందికి కంజీవరం, బనారసీ సిల్క్ వంటి అనేక చీరల గురించి తెలిసే ఉంటుంది. కానీ లోటస్ సిల్క్ గురించి చాలా మందికి తెలిసి ఉండదు. మరి దీని ప్రత్యేకత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష తామర పువ్వులతో తయారైన ఈ చీర ఎంత ప్రత్యేకం అంటే వేసవిలో దీనిని ధరించడం వల్ల చలికాలంలో వెచ్చగా ఉంటుంది. దీన్ని తయారు చేసే ప్రక్రియ కూడా చాలా క్లిష్టంగా ఉంటుంది.

తామర పువ్వు ఫైబర్స్ నుండి చీర తయారు..

ఈ లోటస్ ఫ్యాబ్రిక్ చీరను తయారు చేయడానికి లోటస్ ఫ్లవర్ ఫైబర్‌ను ఉపయోగిస్తారు. సుమారు 1 లక్ష తామర పువ్వుల ఫైబర్‌లను సేకరించి ఫ్యాబ్రిక్ తయారు చేస్తారు. దాని నుండి లోటస్ సిల్క్ చీరను తయారు చేస్తారు. అయితే ఈ చీర కేవలం 50 శాతం లోటస్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేస్తారు. అలాగే ఈ చీర తయారీలో ఇతర పట్టు కూడా కలుపుతారు.

లోటస్ సిల్క్ ఎలా తయారు చేస్తారు ?

బట్టను తయారు చేయడానికి మొదట తామర పువ్వు కాండం మధ్యలో నుంచి విరిచి ఆపై సున్నితంగా దాని నారను లాగుతారు. ఆ తర్వాత ఫైబర్ ను ఒక చివర వేలితో నొక్కి, మరొక వైపు నుండి లాగుతారు. దీంతో ఆ నారలు పెద్దదిగా సాగుతుంది. వీటిని చేతుల సహాయంతో చుట్టి దారం రూపంలో మారస్తారు.

సాదా చీర సిద్ధమైన తర్వాత పెయింటింగ్..

ఈ చీరను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దీని ధర కూడా ఎక్కువ. ముందుగా తామర పువ్వులను సేకరించి, వాటి నారలను వెలికితీసి, ఆపై వాటి నుండి బట్టను తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. తామర నారతలో పాటు ఆ చీరలో ఇతర పట్టును కలిపి సాదా చీరను తయారు చేస్తారు. మొదట ఇద్దరు, ముగ్గురు కళాకారులు ఈ పనిని చేస్తారు. ఆ తర్వాత దాని పై పెయింటింగ్స్ లేదా డిజైన్లను తయారు చేస్తారు. అందుకే ఈ తామర నార చీరలను తయారు చేసేందుకు సుమారుగా ఒక సంవత్సరం పడుతుంది.

తేలికగా, సౌకర్యవంతంగా ఉండే చీరలు..

లోటస్ సిల్క్ చీరలు మనోహరంగా, అందంగా కనిపించడమే కాకుండా, వాటి బరువు 120 నుంచి 150 గ్రాముల మధ్య ఉంటుంది. అందుకే ఏ స్త్రీ అయినా ఈ లైట్ చీరలను మోయడం సులభం అవుతుంది. ఈ చీరలు వేసవిలో చల్లగా, శీతాకాలంలో వేడిగా ఉంటాయి. అందుకే ఈ చీరను ఏ సీజన్‌లోనైనా వీటిని ధరించవచ్చు.


Similar News