Sweets: పలు రకాల స్వీట్లకు తగ్గట్లు పంచదార పాకం వేసే పద్ధతి.. కొలతలు- సూత్రాలివే?
చాలా మంది ఇష్టపడే వాటిలో స్వీట్ ఒకటి. హాట్ కంటే ఎక్కువ మంది తీపిపదార్థాలనే ఎక్కువగా ఇష్టపడుతారు.
దిశ, వెబ్‌డెస్క్: చాలా మంది ఇష్టపడే వాటిలో స్వీట్ ఒకటి. హాట్ కంటే ఎక్కువ మంది తీపిపదార్థాలనే ఎక్కువగా ఇష్టపడుతారు. కొంతమందైతే భోజనం తర్వాత తప్పకుండా స్వీట్ తీసుకుంటారు. అయితే స్వీట్ రెడీ చేయడానికి పాకం పట్టాల్సి ఉంటుంది. పంచదార పాకం ఏ స్వీట్స్ కోసం ఎలా పాకం పట్టాలి? కొలతలు, సూత్రాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నీరు, చక్కెర నిష్పత్తి..
పాకం తయారు చేయాలంటే ముందుగా చక్కెర, వాటర్ ఎంత తీసుకోవాలో సరైన నిష్పత్తిని తెలుసుకోవాలి. మోతాదులో వాటర్ అండ్ పంచదార తీసుకోకపోతే పాకం సరిగ్గా రాదు. కాగా నీరు, పంచదార కరెక్ట్ గా తీసుకోవడం ముఖ్యం. వీటిని ఒకసారి కలిపి మరిగించి పాకం తయారు చేసుకోవాలి.
తేలికపాటి పాకం..
తేలికపాటి పాకాన్ని మైసూర్ పాక్, బూందీ లడ్డూ, కొబ్బరి బర్ఫీ, కాజు కత్లీ వంటి స్వీట్లను రెడీ చేయడానికి ఎక్కువగా పాకం కడతారు.ఇందుకోసం చక్కెర, వాటర్ సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. షుగర్ కరిగేదాకా మరిగించితే సరిపోతుంది. ఎక్కువగా అవసరం లేదు. లేకపోతే పాకం చెడిపోతుంది.
తీగ పాకం..
గులాబ్ జామ్ కోసం తీగపాకాన్ని చేస్తారు. చేతితో పాకం పెట్టి సాగదీస్తే తీగ లాగా సాగితే పాకం సరిగ్గా వచ్చినట్లు. ఈ ప్రాసెస్ తర్వాతే స్టవ్ కట్టేయాలి. లేకపోతే గులాబ్ జామ్ తయారీ సరిగ్గా రాదు.
చిక్కీల కోసం..
నువ్వులు, పల్లీలు, జీడిపప్పు తో చిక్కీలు తయారు చేస్తారన్న విషయం తెలిసిందే. వీటి తయారీకి కూడా పాకం తప్పనిసరి. చిక్కీలు పాకం పట్టేటప్పుడు జాగ్రత్తగా వహించాలి. దీనికి రెండు మార్గాలున్నాయి. ఒకటి పాకం కాస్త నీళ్లలో వేస్తే అది ఉండకట్టాలి. లేకపోతే వాటర్‌లో చేతిని ముంచి పాకం కాస్త చేతి వేళ్ల మధ్య తీసుకుని సాగదీస్తే రెండు తీగలు కనిపించాలి. ఇందుకోసం చక్కెర పాకం కొంచెం చిక్కగా అయ్యాక.. 5 మినిట్స్ ఉడికిస్తే చాలు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.