త‌ల్లి చివ‌రి కోరిక ఇలా తీర్చిన కొడుకు.. అమ్మకు నిజంగా షాక్‌!

ఈ పోస్ట్ నెట్టింట్లో అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టిస్తోంది. A son fulfilled his mother's last wish to see him graduate.

Update: 2022-06-28 12:53 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః జీవితంలో చాలా క‌ష్టాలు, అసంతృప్తులు ఉండొచ్చు. కానీ, కొన్ని సన్నివేశాలు మ‌నుషుల్లో ఆశ‌ని, ఆనందాన్ని మ‌ళ్లీ మ‌ళ్లీ చిగురింప‌జేస్తాయి. అలాంటి సంతోషకరమైన, అంత‌కుమించి, ఉద్వేగభరితమైన ఒక వీడియో ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారింది. ఇది క‌ళ్లు చ‌మ‌ర్చేలా చేస్తుంది. ఐఏఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేసిన ఈ వీడియోలో తన తల్లి చివరి కోరికను తీర్చే కొడుకు భావోధ్వేగం క‌నిపిస్తుంది. వీడియోకు ఇచ్చిన స‌మాచారం ప్రకారం, స్టెఫానీ నార్త్‌కాట్‌కు అనే మ‌హిళ‌కు రెండేళ్ల క్రితం టెర్మినల్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే, తన కొడుకును గ్రాడ్యుయేట్‌గా చూడాలనేది ఆమె చివరి కోరిక. అయితే, ఆమె చివ‌రి ద‌శ‌లో కొడుకు డాల్టన్ త‌ల్లి కోరికను అత్యంత ప్రత్యేకమైన తీరులో నెరవేర్చాడు. స్నేహితులు, కుటుంబం, త‌న‌ పాఠశాల సహాయంతో, డాల్టన్ తన తల్లి కోసం ఆసుపత్రిలోనే ఒక చిన్న గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించాడు. దీనికి స్కూల్ అధికారులు కూడా స్పందించి అందులో పాల్గొంటారు. హృద్యంగా మ‌న‌సును తాకే ఈ లోతైన ఎమోష‌న‌ల్‌ క్లిప్ చివరిలో కొడుకు తన తల్లితో కలిసి, త‌న గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మంలో డ్యాన్స్ చేస్తాడు. "ఈ తల్లికి ఒకే ఒక్క‌ ఆఖరి కోరిక ఉంది" అనే ఈ పోస్ట్ నెట్టింట్లో అంద‌ర్నీ కంట‌త‌డి పెట్టిస్తోంది. 


Similar News