అయ్యో అలా జరిగిందేమిటి!.. ఆధునిక జీవితంలో భాగమవుతున్న పొరపాట్లు

మీరెప్పుడైనా ఇది గమనించారా? ఏదో బిజీలో ఉండి ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరో వ్యక్తికి పంపుతుంటారు.

Update: 2023-06-05 08:19 GMT

దిశ, ఫీచర్స్ : మీరెప్పుడైనా ఇది గమనించారా? ఏదో బిజీలో ఉండి ఒకరికి పంపాల్సిన మెసేజ్ మరో వ్యక్తికి పంపుతుంటారు. మొబైల్ నెంబర్‌ను తప్పుగా టైప్ చేయడంవల్ల గుర్తు తెలియని వ్యక్తులకు కనెక్టవుతుంది. మీకు తెలిసిన వ్యక్తిలాగే అనిపించడంతో మరో వ్యక్తిని పలకరిస్తుంటారు. ఏదో ఆలోచిస్తూ మీరు వెళ్లాల్సిన రూట్ బస్సు కాకుండా మరో బస్సు ఎక్కుతారు. పనికి వెళ్లేటప్పుడు బాక్స్ తీసుకెళ్దామని వంట చేస్తారు.. కానీ తీసుకెళ్లడం మర్చిపోతుంటారు. స్టవ్ మీద అన్నం పెడతారు కానీ మరో ధ్యాసలో ఉండి మర్చిపోవడంతో అది మాడిపోతుంది. అలాగే రైల్ టిక్కెట్ బుక్ చేస్తారు. కానీ మీరు వెళ్లాలనుకున్న సరైన సమయం మెన్షన్ చేయడం మర్చిపోయి ఏదో ఒకటి చేసేస్తుంటారు. అయితే ఇవన్నీ ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో చేసే సాధరణ పొరపాట్లుగా ఉంటున్నాయని వన్ పోల్ సర్వేలో తేలింది.

అధ్యయనంలో భాగంగా నిపుణులు 2000 మంది అడల్ట్స్‌ను వారు జీవితంలో చేసే పొరపాట్లు, మర్చిపోయే సంఘటనల గురించి ప్రశ్నించారు. పైన పేర్కొన్న పొరపాట్లతోపాటు ఏదో పరధ్యానంలో ఉండి తమ కారుకు బదులు ఇతరులు పార్కు చేసిన కారు వద్దకు వెళ్లి అన్ లాక్ చేసేందుకు ప్రయత్నించడం, రెగ్యులర్‌గా ఉపయోగించని సబ్ క్రిప్షన్స్‌ను, టీవీ ఛానల్స్‌ను మర్చిపోవడం వంటివి కూడా ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే 16 శాతం మంది తాము ప్లాన్ చేసుకున్న ఈవెంట్ల గురించి మర్చిపోతున్నారట. మరో 11 శాతం మంది బాత్‌టబ్‌లో పుస్తకాన్ని చదివి, చేతిలో పుస్తకం ఉందన్న విషయం మర్చిపోడంతో అది టబ్‌లో పడిపోతుందట. అయితే ఇలాంటి సంఘటనలు ప్రతి ఒక్కరి జీవితంలో జరగడం, తర్వాత తాము చేసిన పొరపాటువల్ల వ్యక్తులు నవ్వుకోవడం సాధారణంగా జరుగుతుంటాయని అధ్యయనంలో పాల్గొన్న పరిశోధకుల్లో ఒకరు కంపేర్ ది మార్కెట్ కంపెనీ డైరెక్టర్ ఉర్సులా అంటున్నారు.

పొరపాట్లకు కారణం

వన్‌పోల్ స్టడీ ప్రకారం పొరపాట్లు, పరధ్యానం వంటి కారణాలతో అడల్ట్స్ సంవత్సరానికి 84 ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. వారానికి ఒకటి కంటే ఎక్కువ ఇబ్బందికరమైన తప్పులు జరుగుతున్నాయి. అదనంగా 31 శాతం మంది ఒకే తప్పును ఒకటి కంటే ఎక్కువసార్లు చేస్తున్నారు. ఇలా పొరపాట్లు, తప్పులు, రిస్క్ వంటివి ఎదుర్కొంటున్న అత్యంత సాధారణ ప్రదేశాలలో ఇండ్లు, వర్క్ ప్లేస్‌లు 17 శాతం వరకు ఉంటున్నాయి. ఇక సూపర్ మార్కెట్లు 9 శాతం, పబ్స్ 7 శాతం, హాలిడేస్ 7 శాతం కారణం అవుతున్నాయి. హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ 45 శాతం మంది తమ పొరపాట్లను, దురదృష్టాలను చూసి నవ్వుకుంటున్నారు. అయితే 21 శాతం మంది మాత్రం పొరపాట్లు జరిగిన సంఘటనలు, అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటున్నారు. వాస్తవానికి 87 శాతం మంది జీవితంలో తప్పులు, పొరపాట్లు, ప్రమాదాల వంటి సంఘటనల నుంచి తప్పించుకోవడం కష్టమని, అవి జీవితంలో ఒక భాగమని అంగీకరిస్తున్నారు.

పరధాన్యంతో ప్రమాదాలు

ఇతరుల దుర్ఘటనలను కారణమయ్యే అత్యంత సాధారణ భావోద్వేగ ప్రమాదాల్లో 22 శాతం వరకు వ్యక్తులు పరధ్యానంలో ఉండటంవల్ల జరుగుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ప్రతీ 10 మందిలో ఆరుగురికి పైగా, అంటే 63% మంది తమ ఇన్నోసెంట్ మిస్టేక్స్‌ వల్ల బాధపడటం లేదు. ఎందుకంటే అవి తమను మనుషులుగా మార్చడంలో భాగమేనని చెప్తున్నారు. ఇక తాము చేసిన పొరపాట్లు, అనుభవించిన ఆపదల గురించి 52 శాతం మంది తమ భాగస్వాములతో చర్చిస్తున్నారు. 44 శాతం మంది తమ తల్లులు లేదా బంధువులతో చెప్పుకుంటున్నారు. ఇక తమ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటున్నవారు 38 శాతం మంది ఉంటున్నారు. ఫైనల్‌గా అధ్యయనంలో తేలిందేమిటంటే.. జీవితంలో ఒక భాగమైనందును ఎవరు కూడా కనీసం ఒకటి లేదా రెండు తప్పులు కూడా చేయకుండా ఉండలేరు. చాలామంది తమ అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకుంటారని, గత సంఘటనలను గుర్తుచేసుకొని నవ్వుకుంటారని నిపుణులు చెప్తున్నారు. 

Also Read:   Weight Gain Tips: సన్నగా ఉన్న వారు .. వీటిని ఫాలో అయితే లావు అవ్వొచ్చు! 

Tags:    

Similar News