ఫుడ్ సెలెక్షన్‌లో మానవులను అనుకరిస్తున్న ‘గల్ బర్డ్స్’ !

పట్టణ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో, పార్కుల్లో ఎక్కువగా కనిపించే గల్ బర్డ్స్ (gulls) తమ ఆహార ఎంపికలో మానవులను అనుసరించడం

Update: 2023-05-25 07:25 GMT

దిశ, ఫీచర్స్ : పట్టణ పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో, పార్కుల్లో ఎక్కువగా కనిపించే గల్ బర్డ్స్ (gulls) తమ ఆహార ఎంపికలో మానవులను అనుసరించడం నేర్చుకుంటాయని, 90 శాతం మనుషులు తినే ఆహారాన్ని తినడానికి ఇష్టపడతాయని ‘బయాలజీ లెటర్స్’లో పబ్లిషైన ఒక అధ్యయనం పేర్కొన్నది. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి యూకేలోని సస్సెక్స్ యూనివర్సిటీకి చెందిన(University of Sussex) ప్రొఫెసర్ ఫ్రాంజిస్కా ఫీస్ట్ ( Franziska Feist) ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం హెర్రింగ్ గల్స్ బిహేవియర్స్‌‌ను 2021 నుంచి 2022 వరకు స్టడీ చేసింది.

ఈ సందర్భంగా పరిశోధకులు బంగాళదుంపలు, చిప్స్, ఇతర ఆహార పదార్థాలను అవి మానవులను అనుకరిస్తూ తినడానికి కనుగొన్నారు. అలాగే ఈ పక్షులు మనుషులు అధికంగా నివసించే పట్టణ ప్రాంతాలకు దగ్గరగా ఉండే ప్రదేశాలను ఎంచుకొని నివసిస్తాయని, ఆహారం చుట్టూ ఉన్న హ్యూమన్ బిహేవియర్‌పై చాలా శ్రద్ధ చూపుతాయని కనుగొన్నారు. మానవులు, ఇతర జాతులు తినే ఆహారాన్ని అనుకరించి, సేకరించి తినడానికి ఇష్టపడతాయి కాబట్టి వీటిని సైంటిఫిక్ టెర్మ్‌లో నిర్వచించేందుకు పరిశోధకులు క్లెప్టోపారాసైట్స్‌(kleptoparasites) అని కూడా పిలుస్తారని తెలిపారు.

Tags:    

Similar News