తలపైన నిలువుగా సూట్‌కేస్..స్పీడ్‌గా సైకిల్ తొక్కుతుంటే అంతా అవాక్కు! (వీడియో)
విస్మయం చెందిన నెటిజన్లు అతని నైపుణ్యాన్ని ప్రశంసించారు. Man rode bicycle on the streets, balancing heavy suitcase.
దిశ, వెబ్‌డెస్క్ః ఇంటర్నెట్లో అద్భుతమైన కంటెంట్‌కు కొదవే లేదు. ప్రేరణ, స్ఫూర్తి, ఆనందంతో కూడిన వీడియోలైతే కోకొల్లలు.. నెటిజన్ల మనస్సులను దోచుకునే అలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అయ్యింది. 'నౌ దిస్' అనే ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ క్లిప్‌లో అమెరికా వీధుల్లో సైకిల్ తొక్కుతున్న వ్యక్తిని చూడొచ్చు. అయితే, అదేదో సాధారణంగా తొక్కుతున్న సైకిలింగ్ ప్రదర్శన కాదు. తలపై ఒక భారీ సూట్‌కేస్‌ను బ్యాలెన్స్‌గా ఉంచుకుని, వేగంగా, మెలికలు తిప్పుకుంటూ సైకిల్ తొక్కాడు. తలపైన చిన్నపాటి ఇత్తడి లోటా పెట్టుకొని, మన భారతీయ క్లాసికల్ నృత్యం చేసేవారిని మరిపించేటట్లున్న ఈ ఫీట్‌ను నెటిజనులు తెగ మెచ్చుకుంటున్నారు. "భారీ భారం! బ్రూక్లిన్ 5వ అవెన్యూలో ప్రయాణిస్తూ ఈ సైక్లిస్ట్ తన తలపై సూట్‌కేస్‌ని బ్యాలెన్స్ చేసుకుంటాడు" అని పోస్ట్ శీర్షిక చెబుతుంది. ఇది ఆన్లైన్లో షేర్ చేసిన తర్వాత, వేలల్లో వీక్షణలను సంపాదించింది. విస్మయం చెందిన నెటిజన్లు అతని నైపుణ్యాన్ని ప్రశంసించారు.
Heavy load! This cyclist balances a suitcase on his head while traveling up Brooklyn's 5th Avenue 🤯 pic.twitter.com/ndXdHxmd1f
— NowThis (@nowthisnews) June 28, 2022