ఈ అన్న చెల్లెళ్ల అనుబంధానికి జోరున కురిసే వ‌ర్షం సాక్ష్యం! (వీడియో)

నెటిజ‌నులు కామెంట్ల‌తో ప్రేమను కురిపించారు. Heart-touching video of a boy crossing a waterlogged street with his sister.

Update: 2022-07-13 12:04 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః కొన్ని రోజులుగా ఎడ‌తెర‌పి లేకుండా కురుస్తున్న వ‌ర్షంలో ఎంతో మంది రోడ్డుపైన తీవ్ర ఇబ్బందుల‌ను ఎదుర్కుంటున్న ప‌రిస్థితిని మ‌న‌మంతా చూస్తూనే ఉన్నాం. అయితే, ఈ చ‌ల్ల‌ని వాతావ‌ర‌ణంలో మీ ముఖంలో విశాలమైన చిరునవ్వును నింపే ఓ వీడియో ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. తోబుట్టువుల మ‌ధ్య ఇంట్లో ఎన్ని గిల్లిక‌జ్జాలు ఉన్న‌ప్ప‌టికీ, అవ‌స‌రంలో మ‌న అనుకునే తోడు ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఈ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతుంది. అంత‌కుమించి, అన్నా చెల్లెళ్ల మ‌ధ్య అనుబంధం ఎంత హృద్యంగా ఉంటుందో ఈ క్లిప్‌లో చిత్రీకరించబడింది. వీధిలో జోరున కురుస్తున్న వ‌ర్షం, రోడ్డంతా నీట మునిగితే, చిన్నారి త‌న చెల్లిని ఓ అన్న‌ తన వీపుపై మోసుకెళ్లిన ఈ వీడియో అంద‌ర్ని గుండెల్నీ హ‌త్తుకుంది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ వీడియోను ఉమ్దా పంక్తియాన్ అనే పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేయ‌గా, నెటిజ‌నులు కామెంట్ల‌తో ప్రేమను కురిపించారు. మీరూ చూడండి!


Similar News