సూర్యనమస్కారాలు చేసేందుకు బయటికొచ్చిన మొసలి.. బొట్టుపెట్టి పూజలు చేసిన జనాలు

పూర్వకాలం నుంచి హిందువులకు గంగానది పవిత్ర నది. గంగా జలాన్ని అత్యంత పవిత్రమైనదిగా, పరిశుభ్రమైనదిగా భావిస్తారు.

Update: 2024-02-01 15:51 GMT

దిశ, ఫీచర్స్ : పూర్వకాలం నుంచి హిందువులకు గంగానది పవిత్ర నది. గంగా జలాన్ని అత్యంత పవిత్రమైనదిగా, పరిశుభ్రమైనదిగా భావిస్తారు. అంతే కాదు గ్రంథాలలో గంగను దేవతల నది అని కూడా పిలుస్తారు. ఈ నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అంతే కాదు ఇప్పుడు గంగా నది ఒడ్డుకు వచ్చిన ఓ మొసలిని కూడా భక్తితో పూజిస్తున్నారు కొంతమంది ప్రజలు. ఇది మీకు వింతగా అనిపించినా, ఇది నిజం. ఇంతకీ ఈ విచిత్రమైన సంఘటన ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి గత కొన్ని రోజులుగా కాన్పూర్‌లోని గంగాఘాట్ సమీపంలో మొసళ్లు చాలాసార్లు కనిపిస్తూ ఉన్నాయి. గంగానది ఒడ్డున ఉన్న మొసలిని చూసిన ప్రజలు ఘాట్‌లో ప్రజలు భయాందోళనలకు గురవ్వడం పక్కనపెడితే మొసలికి పూజలు చేసి. కుంకుమ బొట్టు పెట్టి వీడియోలు, సెల్ఫీలు దిగారు. ఆ తర్వాత మెల్లిగా ఆ మొసలిని తిరిగి నదిలోకి పంపించేశారు. మొసలిని ఒడ్డుకు తీసుకువచ్చింది మొదలు అది మళ్ళీ నదిలోకి వెళ్లేంతవరకు ఎవరూ కూడా నదిలోకి దిగలేదట. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఈ వీడియోలో మొసలి గంగానది మెట్లపైకి చేరినట్లు చూడవచ్చు. అకస్మాత్తుగా మొసలి కనిపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ మొసలిని చూసిన ప్రజలు బహుశా ఈ మొసలి సూర్యనమస్కారాలు చేయాలనే ఉద్దేశంతో గంగా తీరానికి చేరుకుని ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. ప్రజలు దానిని పట్టుకుని, దాని పై బొట్టు పెట్టి, దానితో సెల్ఫీలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News