దీర్ఘాయుష్షును పెంచుతున్న అందమైన దీవి.. అక్కడి ప్రజలు ఎలాంటి ఆహారం తింటారంటే..

మానవుడి ఆయుష్షు వందేళ్లు అంటుంటారు కానీ.. ప్రస్తుతం అలాంటి గ్యారెంటీ ఏదీ లేదని కూడా నిపుణులు చెప్తుంటారు. 50 ఏండ్లు దాటాక ఒక వ్యక్తి ఎంత కాలం జీవిస్తారనేది చెప్పలేని పరిస్థితి.

Update: 2024-09-03 13:16 GMT

దిశ, ఫీచర్స్ : మానవుడి ఆయుష్షు వందేళ్లు అంటుంటారు కానీ.. ప్రస్తుతం అలాంటి గ్యారెంటీ ఏదీ లేదని కూడా నిపుణులు చెప్తుంటారు. 50 ఏండ్లు దాటాక ఒక వ్యక్తి ఎంత కాలం జీవిస్తారనేది చెప్పలేని పరిస్థితి. పలు రకాల వ్యాధులు, గుండె జబ్బులు, ప్రమాదాలు వంటి కారణాలతో చిన్న వయస్సులోనే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు తరచుగా చూస్తుంటాం కూకడా. కానీ ప్రపచంలోని ఒక దీవిలో నివసించే ప్రజలకు అలాంటి డౌట్స్ ఏమీ లేవు. పైగా తాము వందేండ్లు గ్యారెంటీ బతకగలమని వారు చెప్తుంటారని నిపుణులు పేర్కొంటున్నారు.

ప్రపంచంలోనే ప్రజలు ఎక్కువకాలం జీవించే ప్రదేశాలుగా పేర్కొనే ఐదు బ్లూ జోన్‌లలో ఇకారియా దీవి ఒకటి. ఇది తూర్పు ఏజియన్‌లో ఉన్న ఒక చిన్న గ్రీక్ దీవి. ఇక్కడి ప్రజలు ఇతర దేశాలు, ప్రాంతాల్లో నివసించే వారికంటే ఎక్కువకాలం జీవిస్తున్నారు. పైగా వీరు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే చాన్సెస్ కూడా చాలా తక్కువ. ఈ దీవిలో నివసించే ప్రజల్లో మూడవ వంతు మంది 90 ఏండ్లకు పైబడిన వారు ఇప్పటికీ బతికే ఉండటం మరో విశేషం.

కారణాలివే..

బలమైన సామాజిక సంబంధాలు, బలమైన కుటుంబ వ్యవస్థ, డైలీ హాబిట్స్‌లో వ్యాయామాలు తప్పక కలిగి ఉండటం, నిద్రకు ప్రయారిటీ ఇవ్వడం వంటి అంశాలు ఇక్కడి ప్రజల దీర్ఘాయువుకు కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇక్కడి ప్రజలు కూడా తాము తీసుకునే ఆహారమే తమ దీర్ఘాయుష్షును పెంచుతుందని చెప్తుంటారు. అయితే వారు ఏం తింటారు? అనే సందేహాలు కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు. కానీ మెడిటేరేనియన్ డైట్ మాదిరి ఇకారియన్ దీవి ప్రజల డైట్‌లో కూడా హెల్తీ ఫ్యాట్, పోషకాలు, ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఇక ఇక్కడి ప్రజలు జంక్ ఫుడ్స్ తినడానికి అస్సలు ఇష్టపడరట. కూరగాయలు, దుంపలు, తృణ ధాన్యాలు, బీన్స్, ఆలివ్ ఆయిల్ వంటివి ఎక్కువగా యూజ్ చేస్తారని నివేదికలు పేర్కొంటున్నాయి.

ప్రకృతి ఆధారిత ఆహారాలు

అలాగే సేంద్రియ పంటలు, ప్రకృతి ఆధారిత ఆహారాలను ఎక్కువగా ఇష్టపడతారు. చేపలు, మాంసం, యోగర్ట్, చీజ్ వంటివి కూడా తింటారు కానీ నెలలో కొన్నిసార్లు మాత్రమే వాటిని చాలా తక్కువగా తీసుకుంటారట. ఇలాంటి ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగానే ఇకారియన్ దీవి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగ్గా ఉంటున్నాయని, దీర్ఘాయుష్షును పెంచుతున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. కొంత కాలంగా ఈ దీవి ప్రజల జీవనశైలి గురించిన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండగా.. తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. 


Similar News