Beauty Tips : ముఖంపై యవ్వన ఛాయను పెంచే చాక్లెట్ ఫేస్ మాస్క్‌.. ఇలా వాడితే ముడతలు మాయం!

ముఖంపై ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే చాక్లెట్, అరటి పండు ఫేస్‌మాస్క్‌లతో వాటిని పోగొట్టవచ్చు అంటున్నారు చిట్కా నిపుణులు.

Update: 2024-09-01 13:30 GMT

దిశ, ఫీచర్స్ : ముఖంపై ముడతలు, మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే చాక్లెట్, అరటి పండు ఫేస్‌మాస్క్‌లతో వాటిని పోగొట్టవచ్చు అంటున్నారు చిట్కా నిపుణులు. ఇందుకంటే వీటిలో యాంటీ ఆక్సెడెంట్లు ఫుల్లుగా ఉంటాయి. ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడంలోనూ ఇవి సహాయపడతాయి. కాబట్టి ముఖంపై ముడతలు, వృద్ధాప్య ఛాయలు కనిపిస్తే చాక్లెట్, అరటిపండు ఫేస్ మాస్క్‌లతో పోగొట్టుకోవచ్చు. అయితే అది ఎలా తయారు చేయాలి?.. ఎలా ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం.

* చాక్లెట్, బనానా మిక్స్ : ముఖంపై ముడతలు పోగొట్టే చాక్లెట్ మాస్క్ తయారీ కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోవాలి. తర్వాత వాటిని ఒక గిన్నెలో వేసి కొంచెం తేనె కూడా కలిపి మెత్తగా అయ్యే వరకు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇక అంతే ముఖ చర్మం మృదువుగా మారుతుంది. కొంతకాలం ఇలా ప్రయత్నిస్తే ముడతలు, మొటిమలు ఉన్నా తొలగిపోయి అందంగా, యవ్వనంగా కనిపిస్తారని చిట్కా నిపుణులు అంటున్నారు.

* తేనె, కోకోపౌడర్, దాల్చిన చెక్క : ఈ మూడింటిని పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అందుకోసం ఒక గిన్నె తీసుకోండి. అందులో ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్, ఒక చెంచా తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడిని వేసి మిక్స్ చేయండి. తర్వాత అది మెత్తగా పేస్ట్‌లా మారాక ముఖంపై, మెడపై అప్లై చేసి 15 నిమిషాలకు పైగా ఉంచి శుభ్రంగా కడుక్కోవాలి. దీంతో ముఖం నిగనిగలాడుతుంది.

* ఓట్ మీల్ - చాక్లెట్: ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, ఇంకో రెండు టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, మరో టేబుల్ స్పూన్ పాలు లేదా బాదం పాలు తీసుకోండి. వాటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. మెత్తగా మారాక మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత నీటితో కడగాలి. దీంతో ముఖం నిగనిగలాడుతుంది. కొంత కాలానికి వృద్ధాప్య ఛాయలు పోయి.. చర్మంపై యవ్వన ఛాయలు సంతరించుకుంటాయి.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. నిర్ధారణలు, పర్యవసనాలకు ‘దిశ’ బాధ్యత వహించదు. అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించగలరు. 


Similar News