ఐదేళ్ల చిన్నారిగా మారిపోయిన 20 ఏళ్ల యువతి.. ఆ సౌండ్‌తోనే ఇబ్బందంతా..?

వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు, స్వరం మారుతుందని అందరికీ తెలుసు.

Update: 2024-01-31 14:48 GMT

దిశ, ఫీచర్స్ : వయసు పెరిగేకొద్దీ శరీరంలో మార్పులు, స్వరం మారుతుందని అందరికీ తెలుసు. అయితే, కొందరు వ్యక్తులు ఏదో ఒక వ్యాధితో బాధపడుతున్నప్పుడు, వారి శరీరంలో విచిత్రమైన మార్పులు సంభవిస్తాయి. వారి ఎత్తు పెరగదు, వారి స్వరం చిన్నపిల్లల మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం, అలాంటి ఒక అమ్మాయి వార్తల్లో ఉంది. ఆమె తన వాయిస్ 'ఐదేళ్ల అమ్మాయిలా ఉంది' అని వెల్లడించింది. దీని కారణంగా ప్రజలు ఆమెను ఎవరూ పట్టించుకోరని, ఆమెను ఎగతాళి చేస్తూ ఉంటారట.

ఆ అమ్మాయి తన స్వరం వల్లే తాను చాలా చిన్నపిల్లనని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుందని పేర్కొంది. ఈ అమ్మాయి పేరు 'ఎబోనీ మే'. ఎబోనీ తన కథను సోషల్ మీడియాలో పంచుకుని ఆమె వాయిస్ గురించి ఆందోళన వ్యక్తం చేసింది. 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటికీ, వాయిస్ చిన్నగా ఉండడంతో ప్రజలు తనను 5 - 10 సంవత్సరాల చిన్న అమ్మాయిగా భావిస్తారని ఆమె చెప్పారు. ఆమె పని చేస్తున్నప్పుడు, ఆమె వాయిస్ కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.

ఎబోనీ ఒకసారి పానియాలు ఆర్డర్ చేయడానికి వెళ్ళినప్పుడు అటెండర్ ఆమె చాలా చిన్నదని భావించి తన తల్లిని తీసుకురావాలని కోరారట. 'మీ గొంతు ఎందుకు అలా ఉంది ?' అని నా టీచర్లలో ఒకరు చెప్పే వరకు నా గొంతు చాలా భిన్నంగా ఉందని నేను గుర్తించలేదు' అని ఎబోనీ తెలిపారు. 'ఐదేళ్ల పిల్లలా ఎందుకు మాట్లాడుతున్నావ్' అని జనాలు కూడా ఎన్నోసార్లు అన్నారని తెలిపారు. ప్రజల ఈ వైఖరితో విసుగు చెందిన ఎబోనీ, 'దీని గురించి నేనేమీ చేయలేను, నా గొంతు మార్చుకోలేను' అని చెప్పారట.

మరొక సంఘటనను పంచుకుంటూ, ఎబోనీ ఒక రోజు తన సోదరుడితో కలిసి నైట్‌క్లబ్‌లో ఉన్నప్పుడు, ఒక మహిళ తన వైపు చూస్తూ ఉందని చెప్పింది. అప్పుడు ఆమె తన వద్దకు వచ్చి, కోపంగా, “నీకు ఇక్కడికి వచ్చేంత వయస్సు ఉందా ?” అని అడిగింది. అయితే, ఇప్పుడు జనం చెప్పే మాటలను పట్టించుకోవడం లేదని చెబుతోంది.

Tags:    

Similar News