60 ఏళ్లుగా నిద్రపోని వియత్నాం వృద్ధుడు.. ఫుల్లుగా మందేసినా సరే..

వియత్నాంకు చెందిన 80ఏళ్ల రైతు థాయ్ ఎన్‌గోక్ తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడు. 1942లో జన్మించిన ఆయనకు 20 ఏళ్ల వయసులో జ్వరం వచ్చినప్పటి నుంచి ఇలాగే నిద్రలేకుండా జీవిస్తున్నాడు. అయితే ఈ అరుదైన స్లీప్ డిజార్డర్ తన ఆరోగ్యంపై

Update: 2023-07-01 04:17 GMT

దిశ, ఫీచర్స్: వియత్నాంకు చెందిన 80ఏళ్ల రైతు థాయ్ ఎన్‌గోక్ తీవ్రమైన నిద్రలేమితో బాధపడుతున్నాడు. 1942లో జన్మించిన ఆయనకు 20 ఏళ్ల వయసులో జ్వరం వచ్చినప్పటి నుంచి ఇలాగే నిద్రలేకుండా జీవిస్తున్నాడు. అయితే ఈ అరుదైన స్లీప్ డిజార్డర్ తన ఆరోగ్యంపై ఎలాంటి ఎఫెక్ట్ చూపలేదని, ఇతర రైతుల మాదిరిగానే తాను కూడా చక్కగా వ్యవసాయం చేసుకుంటున్నానని చెప్తున్నాడు.

Full View

చురుకైన జీవితాన్ని గడపాలంటే రోజుకు ఎనిమిది గంటల నిద్ర కంపల్సరీ. కానీ అదేమీ తనకు అవసరం లేదంటున్నాడు థాయ్ ఎన్‌గోక్. అతని భార్య, పిల్లలు, స్నేహితులు, ఇరుగుపొరుగు వారు ఎవరిని అడిగినా సరే ఆయన నిద్రపోతున్నప్పుడు ఎప్పుడూ చూడలేదనే చెప్తున్నారు. డిఫరెంట్ ట్రీట్మెంట్స్, మెడికేషన్, సాంప్రదాయ మందు వినియోగం, పుష్కలంగా మద్యం సేవించినా సరే కంటి మీద రెప్ప వేయలేదని అంటున్నారు. దీంతో కొన్నేళ్లుగా న్యూస్ హెడ్‌లైన్స్‌లో ఉంటున్న ఈ వృద్ధుడు.. సూపర్ పవర్స్‌ ఉన్న వ్యక్తిగా కొనియాడబడుతున్నాడు. అయితే డాక్టర్స్ మాత్రం నిద్రపోతున్నాడు కానీ దాన్ని గుర్తించే సామర్థ్యం అతనికి లేదని చెప్తున్నారు. పగటిపూట నిద్రపోతున్న కొందరు మేల్కొనడం, నిద్రించడం మధ్య వ్యత్యాసాన్ని కనుగొనలేరని.. కాసేపు పడుకుంటుండటంతో ఆరోగ్యం బాగుంటుందని అంటున్నారు.

Read More:   నిద్రలో కలలు కంటున్న ఆక్టోపస్‌లు.. రంగులు మార్చేందుకు అదే కారణం! 


Similar News