మీ బంధాన్ని నిలబెట్టే ఐదు సెకన్ల నియమం..
మీకు, మీ భాగస్వామికి చిన్న విషయంలో గొడవ స్టార్ట్ అయింది. ఇందుకు కారణం చాలా చాలా చిన్నది కానీ పాత విషయాలు ఇందులోకి లాగబడి ఒకరి మీద ఒకరు అరవడం స్టార్ట్ చేస్తారు.
దిశ, ఫీచర్స్ : మీకు, మీ భాగస్వామికి చిన్న విషయంలో గొడవ స్టార్ట్ అయింది. ఇందుకు కారణం చాలా చాలా చిన్నది కానీ పాత విషయాలు ఇందులోకి లాగబడి ఒకరి మీద ఒకరు అరవడం స్టార్ట్ చేస్తారు. ఒకరి మీద ఒకరు పై చేయి సాధించే క్రమంలో వాదన వేడెక్కుతుంది. దురదృష్టవశాత్తు సంబంధాల్లో ఇది సాధారణమే కానీ ఒక్కోసారి పరిస్థితి చేజారవచ్చు. అనుకోని పరిణామాలకు దారితీయవచ్చు. దీనివల్ల మీతోపాటు మీ పిల్లలు కూడా ఎఫెక్ట్ కావచ్చు. అందుకే మీ బంధాన్ని నిలుపుకునేందుకు ఐదు సెకన్ల నియమం ఫాలో కావాలని సూచిస్తుంది తాజా అధ్యయనం.
కమ్యూనికేషన్ సైకాలజీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం దాదాపు ఆరు వేల మంది జంటలపై ప్రయోగం చేసిన శాస్త్రవేత్తలు.. ఐదు, పది, పదిహేను సెకన్ల నియమంపై వర్క్ చేశారు. ఈ మూడు పద్ధతులు కూడా బెస్ట్ రిజల్ట్ ఇచ్చాయని తెలిపారు. ముఖ్యంగా జస్ట్ ఐదు సెకన్లు.. గొడవకు ఫుల్ స్టాప్ పెట్టగలదని చెప్పారు. నిజానికి ఈ ఐదు సెకన్లు గొడవ ఎందుకు అని ఆలోచిస్తే.. పరిస్థితులు మన చేతుల్లో నుంచి జారిపోవు అని, దంపతులు అర్థం చేసుకునేందుకు ఈ టైమ్ సరిపోతుందని చెప్పారు. ఇది పది, పదిహేను సెకన్ల బ్రేక్ మాదిరిగానే ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుందన్నారు.
- గొడవ జరిగినప్పుడు ఐదు సెకన్ల రూల్ ఫాలో అయితే వేడెక్కిన వాతావరణం రాకుండా ఆపగలదు.
- మీ వాదన కంటిన్యూ కాకుండా పిల్లలు డిస్టర్బ్ కాకుండా చేస్తుంది. వారి చిన్న మనసు గాయమై బాధపడిపోకుండా హెల్ చేస్తుంది.
- మీ మానసిక ఆరోగ్యానికి హెల్ప్ చేయడంలోనూ సహాయం చేస్తుంది.