ఆడపిల్లను చంపిన తల్లిదండ్రులకు జీవిత ఖైదు

దిశ, నల్లగొండ క్రైం : కనికరం లేకుండా కన్న కూతురిని విష ప్రయోగం చేసి హతమార్చిన తల్లిందండ్రులకు నల్లగొండ జిల్లా న్యాయమూర్తి ఎంవీ రమేష్ యావజ్జీవ కారాగార శిక్ష, చెరో రూ. 5వేల జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పడమటి తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ జయరామ్, నాగమణికి మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. రెండవ సంతానంగా ఆడ శిశువు జన్మించి అనారోగ్యంతో […]

Update: 2021-02-11 12:55 GMT

దిశ, నల్లగొండ క్రైం : కనికరం లేకుండా కన్న కూతురిని విష ప్రయోగం చేసి హతమార్చిన తల్లిందండ్రులకు నల్లగొండ జిల్లా న్యాయమూర్తి ఎంవీ రమేష్ యావజ్జీవ కారాగార శిక్ష, చెరో రూ. 5వేల జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలం పడమటి తండాకు చెందిన గిరిజన దంపతులు రమావత్ జయరామ్, నాగమణికి మొదటి సంతానంగా ఆడపిల్ల జన్మించింది. రెండవ సంతానంగా ఆడ శిశువు జన్మించి అనారోగ్యంతో మృతి చెందింది. మూడో కాన్పులో కూడా ఆడ శిశువు పుట్టడంతో తాము సాకలేమనే ఉద్దేశంతో ఆ చిన్నారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించలేదు. ఆ చిన్నారిని సాకలేకపోతే శిశుగృహంలో తమ వద్ద పెంచుతామని అధికారులు ఆ దంపతులకు వివరించారు.

కానీ వారు తమ బిడ్డను తామే చూసుకుంటామని నమ్మించి తమ వద్దనే ఉంచుకున్నారు. 2017 ఫిబ్రవరి 4వ తేదీన ఆ చిన్నారి మృతిచెందింది. శిశువు ఆరోగ్యం బాగాలేదని, స్థానిక ఆర్ఎంపీ వైద్యుడికి చూపించిన అనంతరం, దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లామని అక్కడ చికిత్సపొందుతూ మృతి చెందిందని స్థానికులను, అధికారులను నమ్మించారు. అదే ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న అప్పటి సీడీపీవో భూక్యా సక్కుబాయి ఆడ శిశువు మృతిపై తనకు అనుమానం ఉన్నదని, సమగ్ర విచారణ చేయాలని గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు విష ప్రయోగం వల్లే చిన్నారి మృతి చెందినట్లుగా ధ్రువీకరించి అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించి నిందితులను రిమాండ్ కు తరలించారు. నాలుగేళ్ల అనంతరం కేసు నల్లగొండ కోర్టులో విచారణకు వచ్చింది. సాక్ష్యాలు, ఆధారాలు పరిశీలించిన న్యాయమూర్తి చిన్నారిని విష ప్రయోగం చేసి హత్య చేసినట్లుగా ధ్రువీకరించి తల్లితండ్రులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికీ రూ. 5వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

Tags:    

Similar News