క్షమాపణలు చెప్పిన ఎల్జీ పాలిమర్స్
విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని గ్యాస్ లీక్ ఘటనపై ఆ దుర్ఘటనకి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో స్థానికులకు క్షమాపణలు చెప్పింది. బాధితులకు సానుభూతి తెలుపుతున్నట్లు వివరించింది. బాధితులతో పాటు వారి కుటుంబాలకు కూడా అండగా నిలబడుతామని ప్రకటించింది. విష వాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. అన్ని రకాల ఉపశమన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నామని చెప్పింది. మృతుల కుటుంబాలకు […]
విశాఖపట్నంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని గ్యాస్ లీక్ ఘటనపై ఆ దుర్ఘటనకి కారణమైన ఎల్‌జీ పాలిమర్స్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో స్థానికులకు క్షమాపణలు చెప్పింది. బాధితులకు సానుభూతి తెలుపుతున్నట్లు వివరించింది. బాధితులతో పాటు వారి కుటుంబాలకు కూడా అండగా నిలబడుతామని ప్రకటించింది. విష వాయువు ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వంతో కలిసి తమ బృందాలు పనిచేస్తున్నాయని వెల్లడించింది. అన్ని రకాల ఉపశమన చర్యలను తక్షణమే అమలు చేస్తున్నామని చెప్పింది. మృతుల కుటుంబాలకు సహాయం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఘటన వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది.