సరికొత్త మాస్కును ఆవిష్కరించిన ఎల్జీ
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ సరికొత్త మాస్క్‌ను ఆవిష్కరించింది. రెండు ఫ్యాన్లు కలిగిన ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును రూపొందించింది. ఈ మాస్క్‌లో రెస్పిరేటరీ సెన్సార్ ఉంటుంది. గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్ 13 హెచ్‌ఈసీఏ ఫిల్టర్లనూ మాస్కులో ఉపయోగించారు. మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ ద్వారా మాస్క్ ధరించిన వారి శ్వాస పరిమాణం అనుగునంగా ఫ్యాన్లు తిరుగుతాయి. ఇందులో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్‌జీ సరికొత్త మాస్క్‌ను ఆవిష్కరించింది. రెండు ఫ్యాన్లు కలిగిన ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును రూపొందించింది. ఈ మాస్క్‌లో రెస్పిరేటరీ సెన్సార్ ఉంటుంది. గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్ 13 హెచ్‌ఈసీఏ ఫిల్టర్లనూ మాస్కులో ఉపయోగించారు. మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ ద్వారా మాస్క్ ధరించిన వారి శ్వాస పరిమాణం అనుగునంగా ఫ్యాన్లు తిరుగుతాయి.
ఇందులో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. ఈ మాస్కు లో మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020 సదస్సులో ఈ మాస్క్‌ను ఎల్జీ ప్రదర్శించనుంది. ధర వివరాలను మాత్రం లాంచింగ్ సమయంలో వెల్లడించనున్నట్లు సమాచారం.