లైన్‌మెన్ పోస్టులపై హెచ్ఆర్సీకి లేఖ
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్‌ను ఓ కేసు విషయమై నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న 600 జూనియర్ లైన్‌మెన్(జేఎల్ఎమ్) పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా రాజేశం అనే వ్యక్తి రాసిన లేఖను మానవహక్కుల కమిషన్ పిటిషన్‌గా స్వీకరించి మంగళవారం విచారించింది. లైన్‌మెన్ పోస్టుల వ్యవహారంపై జూన్ 2 లోపల నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ కేసును […]
దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ టీఎస్ఎన్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్‌ను ఓ కేసు విషయమై నివేదిక ఇవ్వాల్సిందిగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) ఆదేశించింది. ఎన్పీడీసీఎల్ పరిధిలో ఖాళీగా ఉన్న 600 జూనియర్ లైన్‌మెన్(జేఎల్ఎమ్) పోస్టులను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాల్సిందిగా రాజేశం అనే వ్యక్తి రాసిన లేఖను మానవహక్కుల కమిషన్ పిటిషన్‌గా స్వీకరించి మంగళవారం విచారించింది. లైన్‌మెన్ పోస్టుల వ్యవహారంపై జూన్ 2 లోపల నివేదిక ఇవ్వాలని పేర్కొంటూ కేసును ఆ రోజుకు వాయిదా వేసింది. చాలా జేఎల్ఎమ్ పోస్టులు ఖాళీ అయినప్పటికీ కోర్టు కేసుల కారణం చూపుతూ నియామకాలను ఎన్పీడీసీఎల్ వాయిదా వేస్తోందని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన రాజేశం కమిషన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
Tags: lineman, posts, tsspdcl, letter to hrc