ఆనందయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం.. ?

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కట్టడికి కృష్టి చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్‌కు లేఖ రాశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. నరేష్ లేఖపై ఏపీ గవర్నర్ కార్యదర్శి స్పందించారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(ఈ) మరియు 171(5) […]

Update: 2021-07-10 07:19 GMT

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కట్టడికి కృష్టి చేస్తున్న ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వెన్నెల ఫౌండేషన్ వైస్‌చైర్మన్, హైకోర్టు న్యాయవాది సుంకర నరేష్ ఏపీ గవర్నర్ బీబీ హరిచందన్‌కు లేఖ రాశారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలని లేఖలో కోరారు. నరేష్ లేఖపై ఏపీ గవర్నర్ కార్యదర్శి స్పందించారు. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్‌కు లేఖ రాశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 171(3)(ఈ) మరియు 171(5) ప్రకారం ఎమ్మెల్సీగా నియమించే అవకాశాన్ని పరిశీలించాలని సూచించారు. తన లేఖకు స్పందించి గవర్నర్ కార్యదర్శి, ఏపీ సీఎస్‌కు లేఖ రాయడంపై నరేష్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం ఆనందయ్యను ఎమ్మెల్సీగా నియమిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News