మట్టి, గోమయ గణేష్ ప్రతిమలనే పూజిద్దాం : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో శాస్త్రీనగర్ క్యాంప్ కార్యాలయంలో గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ […]
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మట్టి, గోమయ గణపతి విగ్రహాలకే ప్రాధాన్యమివ్వాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వినాయక చవితిని పురస్కరించుకుని క్లిమోమ్ ఆధ్వర్యంలో శాస్త్రీనగర్ క్యాంప్ కార్యాలయంలో గోమయ గణేష్ విగ్రహాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, క్లిమోమ్ నిర్వాహకురాలు దివ్యారెడ్డి, అల్లోల గౌతంరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి గోమయ గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… పర్యావరణానికి మేలు చేయాలంటే మట్టి, గోమయ గణపతి ప్రతిమలను ప్రతిష్టించి సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాల వల్ల తీవ్ర జల కాలుష్యం పెరిగి పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. పర్యావరణహితం కొరకు రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించి మట్టి విగ్రహాలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృత నిశ్ఛయంతో ఉందని అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు.
కొవిడ్ నేపథ్యంలో నిబంధనలను భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకోవాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతూ ప్రతి ఏటా గోమయ గణేష్ విగ్రహాలను పంపిణీ చేస్తున్న క్లిమోమ్ నిర్వాహకురాలు అల్లోల దివ్యారెడ్డిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు. ఈ వినాయక చవితికి నిర్మల్ నియోజకవర్గంలో 100 గోమయ వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు అల్లోల దివ్యారెడ్డి తెలిపారు. రెండున్నర, ఆరు ఫీట్ల గోమయ గణేష్ విగ్రహాలను అందజేస్తున్నామని చెప్పారు.