వేముల ఆశయాలకు పునరంకితం అవుదాం : తమ్మినేని వీరభద్రం
దిశ, భువనగిరి రూరల్ : ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావించి అలుపెరగని పోరాటాలు చేసిన వేముల మహేందర్ ఆశయాలను సాధించేందుకే ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లలో వేముల మహేందర్ అంతిమయాత్రలో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టజీవుల ఇంటిలో పుట్టి తన జీవితాన్ని కడదాకా మార్క్సిస్టు ఉద్యమానికి అంకితం చేసిన కష్టజీవుల నేస్తం వేముల మహేందర్ […]
దిశ, భువనగిరి రూరల్ : ప్రజల సమస్యలనే తన సమస్యలుగా భావించి అలుపెరగని పోరాటాలు చేసిన వేముల మహేందర్ ఆశయాలను సాధించేందుకే ప్రతి కార్యకర్త పునరంకితం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పులిగిల్లలో వేముల మహేందర్ అంతిమయాత్రలో తమ్మినేని పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కష్టజీవుల ఇంటిలో పుట్టి తన జీవితాన్ని కడదాకా మార్క్సిస్టు ఉద్యమానికి అంకితం చేసిన కష్టజీవుల నేస్తం వేముల మహేందర్ అని కొనియాడారు. ప్రతి కార్యకర్త ఆయన ఆశయాలను సాధించినప్పుడే వేములకు ఘనమైన నివాళి అన్నారు. ఆయన లేని లోటు ప్రజా ఉద్యమాలతో పాటు వారి కుటుంబానికి తీరనిదన్నారు.
సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, నాగయ్య మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘాల ఉద్యమంలో, సామాజిక ఉద్యమాల్లో వేముల మహేందర్ పాత్ర చెరగనిదన్నారు. ఆయన ప్రజా ఉద్యమాలతో పాటు రాజకీయ పదవులకు కూడా వన్నె తెచ్చాడన్నారు. వలిగొండ మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రజా సమస్యలపై అధికారులను, పాలకులను నిరంతరం నిలదీసేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శులు ఎండీ జహాంగీర్, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రామచందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, నాయకులు నరసింహ, ఐలయ్య, తుమ్మల వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.