అక్కడ ఎమ్మెల్యేలు దూరం దూరం
దిశ ప్రతినిధి, నల్లగొండ: వచ్చే శాసనసభ, శాసనమండలి సమావేశాలు కరోనా నిబంధనల మేరకే నిర్వహిస్తామని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేసి, ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు అమర్చుతున్నట్టు వివరించారు. కరోనా నిబంధనలకు విఘాతం కలగకుండా సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని […]
దిశ ప్రతినిధి, నల్లగొండ: వచ్చే శాసనసభ, శాసనమండలి సమావేశాలు కరోనా నిబంధనల మేరకే నిర్వహిస్తామని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ… భౌతికదూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేసి, ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ యంత్రాలు అమర్చుతున్నట్టు వివరించారు. కరోనా నిబంధనలకు విఘాతం కలగకుండా సమావేశాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జగదీష్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం అభినందనీయం అన్నారు. ఈ ప్రమాదంలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నామని, వారి కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారని మండలి చైర్మన్ గుత్తా స్పష్టం చేశారు.