కౌశిక్ రెడ్డికి 'లీగల్' షాక్
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. మధురై కోర్టు నుంచి ఈ లీగల్ నోటీసు జారీ అయింది. టీపీసీసీ చీఫ్ అంశంలో రేవంత్‌రెడ్డి నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఆయన నోటీసులిచ్చారు. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో రూ. కోటి నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వివరించారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ బహిష్కృత నేత పాడి కౌశిక్‌రెడ్డికి ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ లీగల్ నోటీసు పంపారు. మధురై కోర్టు నుంచి ఈ లీగల్ నోటీసు జారీ అయింది. టీపీసీసీ చీఫ్ అంశంలో రేవంత్‌రెడ్డి నుంచి రూ. 50 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలపై ఆయన నోటీసులిచ్చారు. దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేనిపక్షంలో రూ. కోటి నష్టపరిహారంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో వివరించారు.
మధురైకి రండి
ఈ సందర్భంగా మాణిక్కం ఠాగూర్ ట్విట్టర్ వేదికగా కౌశిక్‌రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇష్టానుసారంగా మాట్లాడినందుకు లీగల్ నోటీసు పంపుతున్నామని, మధురైకి తిరుగాల్సి వస్తుందని సూచించారు. ఈ సందర్భంగా మధురైకి స్వాగతం అంటూ ట్విట్టర్లో పేర్కొన్నారు.
https://twitter.com/manickamtagore/status/1414557402339315712