జై భీమ్ సినిమా ఎఫెక్ట్.. హీరో సూర్యకు లీగల్ నోటీసులు
దిశ, డైనమిక్ బ్యూరో : నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి అనగారిన వర్గాలపై పోలీసులు చూపించిన కర్కశత్వాన్ని చూసి చాలా మంది నిద్రలేని రాత్రులు గడిపామని వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇలా రాజకీయ, సినీ వర్గాలు మొదలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ‘జై భీమ్’ సినిమాకు వన్నియార్ సంఘం షాక్ ఇచ్చింది. చిత్రంలోని కొన్ని సంఘటనలు తమ వర్గాన్ని కించపరిచేలా, […]
దిశ, డైనమిక్ బ్యూరో : నిజజీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ‘జై భీమ్’ సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ సినిమా చూసి అనగారిన వర్గాలపై పోలీసులు చూపించిన కర్కశత్వాన్ని చూసి చాలా మంది నిద్రలేని రాత్రులు గడిపామని వారి అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. ఇలా రాజకీయ, సినీ వర్గాలు మొదలు ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటున్న ‘జై భీమ్’ సినిమాకు వన్నియార్ సంఘం షాక్ ఇచ్చింది. చిత్రంలోని కొన్ని సంఘటనలు తమ వర్గాన్ని కించపరిచేలా, పరువుకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయంటూ వన్నియార్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసు జారీ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, పరువు నష్టం కలిగించేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా నోటీసులో రూ.5 కోట్ల నష్టపరిహారం కూడా కోరారు. ‘‘ సినిమాలోని సంఘటనలు నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఉన్నప్పటికీ, రాజకన్నును హింసించే పోలీసు పాత్రను ఉద్దేశపూర్వకంగా వన్నియార్ కులానికి చెందినదిగా చిత్రీకరించారని’’ లీగల్ నోటీసులో పేర్కొన్నారు. అంతేకాకుండా, సినిమాలో వాస్తవ సంఘటనలోని నిజమైన పాత్రల అసలు పేర్లను చేర్చారని, కానీ ఉద్దేశపూర్వకంగానే ఎస్సై పేరును మార్చారని ఆరోపించారు. అయితే, ఇదివరకే పీఎంకే నేత, మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ అన్బుమణి రామదాస్ ‘జై భీమ్’ సినిమా పై పలు ఆరోపణలు చేయగా.. దానికి హీరో సూర్య స్పందిస్తూ.. తనకు గానీ, తన చిత్ర యూనిట్‌కు గానీ ఏ వ్యక్తిని లేదా సమాజాన్ని కించపరిచే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘జై భీమ్‌లోని ప్రధాన అంశం రిటైర్డ్ జస్టిస్ చంద్రు వాదించిన కేసులో అధికారులపై న్యాయ పోరాటం ఎలా సాగింది. న్యాయం కోసం ఆయన ఎలా సహాయపడ్డారు అన్న అంశాలను మాత్రమే చూపించేందుకు ప్రయత్నించాము.” అని సూర్య బదులిచ్చారు.