బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం సుబర్బన్ లోని ఆరోగ్య నిధి ఆస్పత్రిలో చేరారు. అయితే, ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిన.. అర్థరాత్రి 1.30 సమయంలో ఒక్కసారిగా గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు. బాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన బక్షి ఎక్కువగా నిర్మాతగా పనిచేశాడు. మంజీలే ఔర్ భీ […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత జానీ బక్షీ (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా శ్వాస సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన శుక్రవారం సుబర్బన్ లోని ఆరోగ్య నిధి ఆస్పత్రిలో చేరారు. అయితే, ఈ నేపథ్యంలోనే కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిన.. అర్థరాత్రి 1.30 సమయంలో ఒక్కసారిగా గుండె పోటుకు గురై తుది శ్వాస విడిచారు.
బాలీవుడ్‌లో నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన బక్షి ఎక్కువగా నిర్మాతగా పనిచేశాడు. మంజీలే ఔర్ భీ హై (1974), రావన్, (1984) ఫిర్ తేరి కహానీ యాద్ ఆయీ (1993) వంటి చిత్రాలను నిర్మాతగా ఉన్నాడు. రాజేష్ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన డాకు ఔర్ పోలీస్ (1992) మరియు ఖుదాయి (1994) అనే రెండు చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. బాలీవుడ్‌లో ప్రముఖులు ఇదే సంవత్సరంలో వెనువెంటనే మరణించడం బాధాకరం. ఇప్పటికే ఇండస్ట్రీలో ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సరోజ్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, రాజన్ సెహగల్ మృతి చెందిన సంగతి తెలిసిందే.