ప్రముఖ నటి మాలాశ్రీ భర్త ‘కోటి రాము’ కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, నటి మాలశ్రీ భర్త కుణిగల్ రాము కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గోలీబార్ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమైన ఆయన దాదాపు 39 సినిమాలను నిర్మించారు. శాండల్‌వుడ్‌లో కోట్లాది రూపాయలతో సినిమా తీసిన నిర్మాతగా ‘కోటి […]
దిశ, వెబ్‌డెస్క్: కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, నటి మాలశ్రీ భర్త కుణిగల్ రాము కన్నుమూశారు. ఇటీవల కరోనా బారినపడిన ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గోలీబార్ సినిమా ద్వారా నిర్మాతగా పరిచయమైన ఆయన దాదాపు 39 సినిమాలను నిర్మించారు. శాండల్‌వుడ్‌లో కోట్లాది రూపాయలతో సినిమా తీసిన నిర్మాతగా ‘కోటి రాము’గా ఆయన పేరొందారు. ఏకే 47, లాకప్‌డెత్, కలాసిపాళ్య లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను నిర్మించారు. కన్నడ సినిమా రంగంలో హీరోయిన్‌గా రాణిస్తున్న మాలాశ్రీని వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.