జాతీయ సదస్సులో మెరిసిన ‘నాయక్’!

దిశ బ్యూరో, హైదరాబాద్: పాఠశాల విద్యా రంగంపై జాతీయస్థాయి సదస్సు ఢిల్లీలో నిన్న, ఇవాళ తలపెట్టారు. ఆ నేషనల్ కాన్ఫరెన్సులో పాల్గొనే చాన్స్ తెలంగాణ నుంచి ముగ్గురికి లభించింది. వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ బాయ్స్ హైస్కూల్ హెడ్మాస్టర్ బి.విఠల్ నాయక్ త‘లుక్కు’మన్నారు. విద్యా సేవలో తన సాఫల్యాలు నిర్వాహకుల మెప్పు పొందాయి. ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రధానోపాధ్యాయుడిగా కితాబిచ్చారు. ‘National Conference on Leadership for Quality Improvement in Schools’ అంశంపై […]

Update: 2020-02-28 08:42 GMT

దిశ బ్యూరో, హైదరాబాద్:

పాఠశాల విద్యా రంగంపై జాతీయస్థాయి సదస్సు ఢిల్లీలో నిన్న, ఇవాళ తలపెట్టారు. ఆ నేషనల్ కాన్ఫరెన్సులో పాల్గొనే చాన్స్ తెలంగాణ నుంచి ముగ్గురికి లభించింది. వారిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ బాయ్స్ హైస్కూల్ హెడ్మాస్టర్ బి.విఠల్ నాయక్ త‘లుక్కు’మన్నారు. విద్యా సేవలో తన సాఫల్యాలు నిర్వాహకుల మెప్పు పొందాయి. ఉత్తమ నాయకత్వ లక్షణాలు కలిగిన ప్రధానోపాధ్యాయుడిగా కితాబిచ్చారు. ‘National Conference on Leadership for Quality Improvement in Schools’ అంశంపై 27, 28వ తేదీల్లో జాతీయస్థాయి సదస్సు నిర్వహించారు. దీనిని National Centre for School Leadership సంస్థ ఆర్గనైజ్ చేసింది. పాఠశాలల్లో గుణాత్మక విద్య పెంపొందించే నాయత్వంపై చర్చించారు. తమ బడిలో చేపట్టిన వివిధ వైవిధ్యభరిత, వినూత్న కార్యక్రమాలు, స్టూడెంట్ల సక్సెస్ స్టోరీలు, దాతల సహకారంపై విఠల్ నాయక్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విద్యార్థుల ఉన్నతికి కృషి చేస్తున్న ఈ మాస్టారును బెస్ట్ లీడరుగా నిర్వాహకులు అభినందించారు.

Tags:    

Similar News