టికెట్ కోసం ట్రిక్కులు.. వైసీపీలో నేనంటే నేనంటున్న నేతలు
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీ కానుంది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పట్టాలెక్కనుంది. సుమారు 8 స్థానాలు భర్తీ కానున్నాయి. దీంతో ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో జిల్లా నుంచి చాంతాడంత లిస్ట్ రెడీ అయ్యింది. తమకు అవకాశాలు కల్పించాలంటూ అప్పుడే పైరవీలు మెుదలు పెట్టేశారు. అనంతపురం జిల్లాలో అయితే ఎమ్మెల్సీ టికెట్ ఆశించే వారి సంఖ్య విపరీతంగా ఉంది. జిల్లా […]
దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో త్వరలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీల భర్తీ కానుంది. పరిషత్ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ పట్టాలెక్కనుంది. సుమారు 8 స్థానాలు భర్తీ కానున్నాయి. దీంతో ఆశావాహుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఒక్కో జిల్లా నుంచి చాంతాడంత లిస్ట్ రెడీ అయ్యింది. తమకు అవకాశాలు కల్పించాలంటూ అప్పుడే పైరవీలు మెుదలు పెట్టేశారు. అనంతపురం జిల్లాలో అయితే ఎమ్మెల్సీ టికెట్ ఆశించే వారి సంఖ్య విపరీతంగా ఉంది. జిల్లా నుంచి గురునాథ్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి, శివరామిరెడ్డి, శమంతకమణిలు ఎమ్మెల్సీ సీటుకోసం పోటీ పడుతున్నారు. వీరంతా గతంలో ఎమ్మెల్యేలుగా.. ఎమ్మెల్సీలుగా పని చేసిన వారే.
వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని జగన్‌ను కోరుతున్నారట. అలాగే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి సైతం తనను మండలికి పంపించాలంటూ వేడుకుంటున్నారట. 2014 ఎన్నికల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ వీడినా విశ్వేశ్వర్‌రెడ్డి మాత్రం జగన్ వెంటే నడిచారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఎమ్మెల్సీ ఇచ్చి తనకు న్యాయం చేయాలని కోరుతున్నారట. మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి తనకు కూడా ఎమ్మెల్సీ కావాలని అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. ఇకపోతే అనంతపురం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత అయిన శమంతకమణి సైతం మరో అవకాశం ఇవ్వాలని కోరుతున్నారట. మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారట శమంతకమణి. మరోవైపు అహుడా ఛైర్మన్ పదవి అయినా ఇవ్వాలని కోరుతున్నారట. మరి సీఎం జగన్ మదిలో ఏముందో అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.