ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ నాగమల్లుకు అరుదైన గౌరవం
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఉత్తమ అవార్డులు లభించాయి. కరోనా కష్టకాలంలో ప్రజలకు మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. భోజన, వసతి సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా… వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు గాను హెచ్ఎంటీవీ వారు ప్రవేశపెట్టిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అవార్డు చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు దక్కింది. అదే గ్రామానికి చెందిన […]
దిశ, తుంగతుర్తి: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు ఉత్తమ అవార్డులు లభించాయి. కరోనా కష్టకాలంలో ప్రజలకు మహమ్మారిపై అవగాహన కల్పిస్తూ.. భోజన, వసతి సౌకర్యాలు కల్పించిన విషయం తెలిసిందే. అంతేగాకుండా… వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసినందుకు గాను హెచ్ఎంటీవీ వారు ప్రవేశపెట్టిన కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ అవార్డు చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఎల్బీనగర్ ట్రాఫిక్ సీఐ అంజపల్లి నాగమల్లు దక్కింది. అదే గ్రామానికి చెందిన సినీ డైరెక్టర్, రచయిత నామాల రవీంద్రసూరికి సాహిత్య విభాగంలో ఉత్తమ మానవీయ కవి అవార్డు లభించింది. ఈ అవార్డులను ఆదివారం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో రాష్ట్ర మంత్రి హరీష్ రావు, సినీ నటుడు శ్రీకాంత్, హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్‌లు అందజేశారు. వీరిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.