న్యూడెమోక్రసీ కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన

దిశ, నూతనకల్: సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నూతనకల్ మండల కార్యాలయ నిర్మాణానికి సీనియర్ నాయకులు పెద్దింటి రంగారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య, సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ లు పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి,ఉద్యమ విస్తరణకు కేంద్రబిందువుగా ఈ కార్యాలయంను ఉపయోగించుకోవాలని అన్నారు. దీని నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజల సహాయ, సహకారాలు అందించాలని కోరారు. శ్రామిక రాజ్యస్థాపనకి, […]

Update: 2021-12-26 04:59 GMT

దిశ, నూతనకల్: సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ నూతనకల్ మండల కార్యాలయ నిర్మాణానికి సీనియర్ నాయకులు పెద్దింటి రంగారెడ్డి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ డివిజన్ కార్యదర్శి గంటా నాగయ్య, సబ్ డివిజన్ కార్యదర్శి బొడ్డు శంకర్ లు పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, ప్రజల సమస్యల పరిష్కారానికి,ఉద్యమ విస్తరణకు కేంద్రబిందువుగా ఈ కార్యాలయంను ఉపయోగించుకోవాలని అన్నారు. దీని నిర్మాణానికి అన్ని వర్గాల ప్రజల సహాయ, సహకారాలు అందించాలని కోరారు.

శ్రామిక రాజ్యస్థాపనకి, దోపిడీ వ్యవస్థ నిర్మూలనకు, ప్రజలను ఐక్యం చేసి పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నూతనకల్ మండల కేంద్రంలో నిరంతరం ప్రజా ఉద్యమాలలో పాల్గొంటూ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వ అధికారులను, పాలకులను, నిలదీస్తూ ఉన్నది.కాబట్టి ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ఆఫీస్ నిర్మాణం కోసం మీ వంతు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో గునగంటి జగదాంబ ,గునగంటి సత్యవేదు గౌడ్, పార్టీ సీనియర్ నాయకులు మహంకాళి సోమయ్య,డివిజన్ నాయకులు దేసోజు మధు,చిల్పకుంట్ల పార్టీ గ్రామ కార్యదర్శి సుంకిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,దగ్గుల మల్లయ్య,యాలమకంటి సత్తయ్య,కూసు ఉప్పలయ్య, అంజయ్య,మిరియాల హరికృష్ణ,ఇరుగు రవి,కూసు లింగయ్య,గడ్డం శ్రీను,బిక్కి రవి,ప్రవీణ్,పచ్చిపాల లింగయ్య,గంట కార్తిక్ ,తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News