గంగులకు రూ.360 కోట్ల ఫైన్.. తప్పుడు సమాచారం వల్లే ఇదంతా..!

దిశ, కరీంనగర్ సిటీ : కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే మంత్రి గంగుల కమలాకర్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రానైట్ వ్యాపారంలో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేస్తూ రూ.360కోట్ల జరిమానా విధించిందని పలు పత్రికలు, కొన్ని ఛానెళ్లలో కథనాలు వచ్చాయని.. వాస్తవానికి మంత్రి కమలాకర్‌కు శ్వేత గ్రానైట్ సంస్థలో ఎటువంటి భాగస్వామ్యం లేదని తెలిసినట్టు వెల్లడించారు. […]

Update: 2021-08-11 10:13 GMT

దిశ, కరీంనగర్ సిటీ : కొంతమంది ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే మంత్రి గంగుల కమలాకర్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేసినట్లు న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గ్రానైట్ వ్యాపారంలో మంత్రికి ఈడీ నోటీసులు జారీ చేస్తూ రూ.360కోట్ల జరిమానా విధించిందని పలు పత్రికలు, కొన్ని ఛానెళ్లలో కథనాలు వచ్చాయని.. వాస్తవానికి మంత్రి కమలాకర్‌కు శ్వేత గ్రానైట్ సంస్థలో ఎటువంటి భాగస్వామ్యం లేదని తెలిసినట్టు వెల్లడించారు.

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన విషయం కూడా అవాస్తవమేనని, తనను తప్పుదోవ పట్టించడం వల్లే తెలుసుకోకుండా వ్యాఖ్యలు చేసినట్టు ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో తనకు వ్యక్తిగతంగా ఎలాంటి విభేదాలు లేవని, మీడియాలో వచ్చిన ఘటనలపై ఆయనతో పాటు గ్రానైట్ వ్యాపారంలో ఉన్న వ్యాపారస్తులు మనోవేదనకు, ఇబ్బందికి గురైనట్లు తెలిసిందని.. ఈ విషయంలో తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు న్యాయవాది భేతి మహేందర్ రెడ్డి తెలిపారు.

Tags:    

Similar News