ఓహో..!‌మీరంతా సర్కార్ సెలబ్రిటీలేనా.. సచిన్‌పై 'రూపాయి హీరో' ఆగ్రహం

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు పలికారు. అయితే రైతుల ఆందోళనపై అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై ప్రముఖ సుప్రీం కోర్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు బీజేపీ మద్దతు దారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు.?రిహాన్నా, గ్రెటా ట్వీట్లు […]

Update: 2021-02-04 22:13 GMT

దిశ,వెబ్‌డెస్క్: కేంద్రం ప్రవేశ పెట్టిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి పలువురు అంతర్జాతీయ సెలబ్రిటీలు మద్దతు పలికారు. అయితే రైతుల ఆందోళనపై అంతర్జాతీయ సెలబ్రిటీలు తలదూర్చడాన్ని వ్యతిరేకిస్తూ సచిన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ పై ప్రముఖ సుప్రీం కోర్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ కౌంటరిచ్చారు. రైతుల దీక్షలో కరెంట్, నీళ్లు, ఇంటర్నెట్ సేవలను కట్ చేసినప్పుడు బీజేపీ మద్దతు దారులు రాళ్లు విసిరినప్పుడు వీళ్లంతా ఏమయ్యారు.?రిహాన్నా, గ్రెటా ట్వీట్లు చేసే సరికి అందరూ నోళ్లు తెరుస్తున్నారు. వీళ్లంతా వెన్నెముక లేని, మనసులేని సర్కార్ సెలబ్రిటీలు’ అని కౌంటర్ ఇచ్చారు.

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టీస్ పైనే విమర్శలు

గతేడాది జూన్ 27న దేశంలోని పరిస్థితుల్ని ప్రస్తావిస్తూ గత ఆరేళ్లలో ఈ దేశంలో అధికారికంగా ఎమర్జెన్సీ లేకపోయినప్పటికీ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ స్థాయిలో విధ్వంసానికి గురైంది అన్నది చరిత్రకారులు గుర్తిస్తారు. అలా విధ్వంసానికి గురవ్వడంలో గత సుప్రీం కోర్ట్ న్యాయమూర్తుల పాత్రకూడా ప్రస్తావనకు వస్తుందని సుప్రీం కోర్ట్ లాయర్ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.

మరో రెండు రోజుల తరువాత అంటే జూన్ 29న మరో ట్వీట్లో ప్రస్తుత సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ బాబ్డే పై విమర్శలు చేశారు. సుప్రీం కోర్ట్‌ను లాక్ డౌన్ మోడ్ లో పెట్టి ప్రజలు న్యాయాన్ని అభ్యర్ధించే కనీస ప్రాథమిక హక్కు కూడా లేకుండా చేసి బీజేపీ ఎంపీకి చెందిన రూ.50లక్షల బైక్ పై మాస్క్, హెల్మెట్ లేకుండా సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి బాబ్జే ఎంజాయ్ చేస్తున్నారంటూ ప్రశాంత్ భూషణ్ మరో ట్వీట్ చేశారు.

రూపాయి హీరోగానే సుపరిచితులు

ఈ రెండు ట్వీట్ల ఆధారంగా జులై 22న సుప్రీం కోర్ట్ తిసభ్య ధర్మాసనం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. విచారణలో భాగంగా సుప్రీం కోర్ట్ జస్టీస్ అరుణ్ మిశ్రా, బీఆర్ గావి, కృష్ణ మురారిల త్రిసభ్య ధర్మాసనం ప్రశాంత్ భూషణ్‌కు రూపాయి జరిమానా విధించడంతో పాటు జైలు శిక్షను ఖరారు చేసింది. అయితే ప్రశాంత్ భూషణ్‌కు జైలుశిక్ష విధించవద్దంటూ అటార్నీ జర్నల్‌తోపాటు పలువురు న్యాయవాదులు సుప్రీంను కోరారు.అయితే ప్రశాంత్ భూషణ్ సుప్రీం కోర్ట్కు క్షమాపణలు చెబితే శిక్ష ఉండదంటూ వెసులు బాటు కల్పించింది. కానీ ప్రశాంత్ భూషణ్ మాత్రం కోర్ట్ క్షమాపణలు చెప్పేది లేదని తెగేసి చెప్పారు. అలా చెబితే నామనసాక్షిని చంపుకున్నట్లేనని స్పష్టం చేశారు. దీంతో సుప్రీం కోర్ట్ ప్రశాంత్ భూషణ్కు రూపాయి జరిమానా విధించింది. సెప్టెంబర్ 15లోగా ఆ రూపాయి కట్టలేదంటే మూడు నెలలజైలు శిక్ష, మూడేళ్ల పాటు న్యాయవాద వృత్తికి దూరంగా ఉండాల్సి ఉంటుందని సుప్రీం కోర్ట్ తన తీర్పులో చెప్పింది. అయితే సుప్రీం తీర్పుతో ప్రశాంత్ భూషణ్ కోర్ట్ రూపాయి చెల్లించి శిక్షనుంచి భయటపడ్డారు.

మరోవైపు ప్రజలు పక్షాన నిలబడే ప్రశాంత్ భూషణ్ కు సోషల్ మీడియా నెటిజన్లు రూపాయి హీరో అంటూ కితాబు ఇచ్చారు. అంతేకాదు ప్రశాంత్ భూషణ్ కంటే రూపాయి హీరోగా అందరికి సుపరిచితులయ్యారు.

Tags:    

Similar News