మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ : లావణ్య

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. హైదరాబాద్ నుంచి తన సొంతూరు డెహ్రాడూన్ చేరుకుంది. లాక్‌డౌన్‌లో భాగ్యనగరంలోనే గడిపిన అమ్మడు.. చాలా రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో చాలా హ్యాపీగా ఉన్న లావణ్య.. ఇంట్లోవాళ్లతో కలిసిపోవడానికి భయమేసిందని చెప్పింది. తనొక కరోనా వారియర్‌గా మారి, ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టాలనుకోలేదని.. అందుకే హైదరాబాద్ నుంచి పీపీఈ కిట్ ధరించి మరీ డెహ్రాడూన్ వరకు ప్రయాణం చేసినట్లు చెప్పింది. అక్కడ టెస్ట్‌లు చేయించాక నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నట్లు […]

Update: 2020-08-19 08:26 GMT

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి.. హైదరాబాద్ నుంచి తన సొంతూరు డెహ్రాడూన్ చేరుకుంది. లాక్‌డౌన్‌లో భాగ్యనగరంలోనే గడిపిన అమ్మడు.. చాలా రోజుల తర్వాత ఇంటికి చేరుకుంది. దీంతో చాలా హ్యాపీగా ఉన్న లావణ్య.. ఇంట్లోవాళ్లతో కలిసిపోవడానికి భయమేసిందని చెప్పింది. తనొక కరోనా వారియర్‌గా మారి, ఇంట్లో వాళ్లను ఇబ్బంది పెట్టాలనుకోలేదని.. అందుకే హైదరాబాద్ నుంచి పీపీఈ కిట్ ధరించి మరీ డెహ్రాడూన్ వరకు ప్రయాణం చేసినట్లు చెప్పింది. అక్కడ టెస్ట్‌లు చేయించాక నెగెటివ్ రావడంతో ఊపిరి పీల్చుకున్నట్లు వెల్లడించింది. అంతేకాదు, ఆ తర్వాత రెండు రోజులు గడిచాక మాత్రమే.. ఇంట్లోవాళ్లతో కలిసిపోయానని తెలిపింది.

ఇక ఇంటికి దూరంగా.. ఒంటరిగా ఉండడం చాలా కష్టమని తెలిపిన లావణ్య.. సెలెబ్రిటీలు అందం, అభినయంపై మాత్రమే కాదు, మెంటల్ హెల్త్‌పై కూడా దృష్టి పెట్టాలని చెప్పింది. తమ బంధువుల్లో ఒకరు అలాగే చనిపోయారని.. అప్పుడే తనకు ఆ బాధ ఎలా ఉంటుందో అర్థమైందని చెప్పుకొచ్చింది లావణ్య.

Tags:    

Similar News