హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..!
దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ను నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది.
దిశ, వెబ్ డెస్క్: దినదినాభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ ను నివారించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ముఖ్య కూడళ్లలో ఫ్లై ఓవర్లను నిర్మిస్తూ ప్రజా రవాణాను మరింత సులభతరం చేస్తుంది. ఇప్పటికే పలు జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్లు నగరవాసులకు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో ఫ్లైఓవర్‌ను నేడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
ఎల్బీనగర్ చౌరస్తాలో వనస్థలిపురం - దిల్‌సుఖ్ నగర్ మార్గంలో ఎల్బీ నగర్ కూడలి వద్ద నిర్మించిన అత్యాధునికి హంగులతో నిర్మించిన ఫ్లై ఓవర్ ను ఈ రోజు మంత్రి ప్రారంభించనున్నారు. సాయంత్రం నాలుగు గంటలకు కేటీఆర్ ఫ్లై ఓవర్ ను ప్రారంభిస్తారు. విజయవాడ నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనదారులకు ప్రయాణం మరింత సులువు కానుంది. రూ.32 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్ ను నిర్మించారు.